ETV Bharat / bharat

'రాజకీయాల కోసం సినిమాలు మానేందుకు సిద్ధం' - కమల్​ హాసన్

రాజకీయ జీవితానికి అడ్డుగా ఉంటే సినిమాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం అని ప్రకటించారు మక్కల్​ నీది మయ్యమ్​ చీఫ్​ కమల్​ హాసన్. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. ఎవరు రాజకీయాల నుంచి తప్పుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు.

కమల్​ హాసన్, kamal hassan on quitting cinema
కమల్​ హాసన్
author img

By

Published : Apr 4, 2021, 7:17 PM IST

రాజకీయ జీవితానికి అడ్డుగా ఉంటే నటన నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్. తన రాజకీయ ప్రవేశం చారిత్రకమైనదని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తాను అనూహ్యంగా ఇందులోకి ప్రవేశించానని కోయంబత్తూరులో మీడియా ప్రతినిధులతో చెప్పారు.

"మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్​ ఎమ్మెల్యేగా అనేక సినిమాల్లో నటించారు. ప్రజా సేవే లక్ష్యంగా ఆ చిత్రాల్లో తన సిద్ధాంతాలను తెలియజేశారు. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాలను పూర్తి చేస్తాను. ఆ తర్వాత రాజకీయాలకు సినిమా అడ్డుగా ఉంటే దానికి దూరంగా ఉండేందుకు సిద్ధం. నేను త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ సినిమాలు చేస్తానని పలువురు అంటున్నారు. ఎవరు రాజకీయాల నుంచి తప్పుకోవాలో ప్రజలే నిర్ణయిస్తారు."

-కమల్​ హాసన్, మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత

తనపై పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కమల్​. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇదీ చదవండి : మిజోరాం సరిహద్దులో అక్రమ ఆయుధాల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.