తాలిబన్ల వ్యవహారం సహా కశ్మీర్ లోయలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఉద్ఘాటించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న క్రమంలో కశ్మీర్‌కు ముప్పు పొంచి ఉందనే ఆందోళనల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని, ఉగ్రమూకల ఏరివేతకు సంసిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
అయితే, కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉంచాలంటే ప్రజల సహకారం కూడా కావాలని కోరారు విజయ్ కుమార్. ఉగ్రవాదులు, సూసైడ్ బాంబర్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని.. లేకపోతే నష్టపోయేది స్థానికులేనని వెల్లడించారు.
ఇదీ చూడండి: తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్