ETV Bharat / bharat

RCFL Apprentice Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. RCFLలో 408 అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 10:47 AM IST

RCFL Apprentice Jobs 2023 In Telugu : ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రాష్ట్రీయ కెమికల్స్​ అండ్​ ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ (RCFL) 408 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RCFL Recruitment 2023
RCFL Apprentice Jobs 2023

RCFL Apprentice Jobs 2023 : ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్​ అండ్​ ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ (RCFL) 408 గ్రాడ్యుయేట్​, టెక్నీషియన్​, ట్రేడ్​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ - 157 పోస్టులు
  • టెక్నీషియన్ అప్రెంటీస్​ - 115 పోస్టులు
  • ట్రేడ్ అప్రెంటీస్​ - 136 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 408

విద్యార్హతలు
RCFL Apprentice Eligibility :

  • గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​ పోస్టులు : అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు బీకామ్/ బీబీఐ/ఎకనామిక్స్ ప్రధాన అంశంగా డిగ్రీ పాస్​ అయ్యుండాలి. బేసిక్ ఇంగ్లీష్​ నాలెడ్జ్​ ఉండాలి.
  • టెక్నీషియన్ పోస్టులు : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా కెమికల్​/ సివిల్​/ కంప్యూటర్​/ ఎలక్ట్రికల్​/ ఇన్​స్ట్రుమెంటేషన్​/ మెకానికల్​ విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
  • ట్రేడ్ అప్రెంటీస్​ పోస్టులు : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 10వ తరగతి/ 10+2/ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి :
RCFL Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 ఏప్రిల్​ 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

నోట్​ : విద్యార్హతలు, వయోపరిమితి విషయంలో పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​లో చూడండి.

ఎంపిక విధానం :
RCFL Apprentice Selection Process : అకడమిక్​ మార్కుల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను అమలు చేస్తారు.

స్టైపెండ్​
RCFL Apprentice Salary :

  • ట్రేడ్​​ అప్రెంటీస్​ (వొకేషనల్​) : నెలకు రూ.7,000
  • టెక్నీషియన్​ అప్రెంటీస్ (డిప్లొమా హోల్డర్స్​) : నెలకు రూ.8,000
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ (డిగ్రీ హోల్డర్స్​) : నెలకు రూ.9,000

దరఖాస్తు విధానం
RCFL Apprentice Application Process :

  • ముందుగా మీరు ఆర్​సీఎఫ్​ఎల్​ అధికారిక వెబ్​సైట్​ https://www.rcfltd.com ఓపెన్ చేయాలి.
  • Recruitment ట్యాబ్​ను క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • Engagement of apperntice 2023-24 లింక్​పై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీకు జాబ్​ అడ్వర్టైజ్​మెంట్​ సహా, Apply online లింక్​ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. అన్ని వివరాలు చెక్​ చేసుకుని, దానిని సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ తీసుకుని, దానిని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
RCFL Apprentice Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్ 24
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్​ 7

CSL Engineering Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. కొచ్చిన్ షిప్​యార్డ్​లో 145 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

SSB Constable Jobs 2023 : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.