ETV Bharat / bharat

బ్యాంకులకు తిరిగొచ్చిన మూడోవంతు రూ.2000నోట్లు.. ఇంకా 3 నెలల గడువు ఉండగానే.. - దిల్లీ హైకోర్టు రూ 2000 నోటు

2000 Notes Deposit : ఇప్పటివరకు రూ.2.72 లక్షల కోట్లు విలువగల రూ.2 వేల నోట్లు బ్యాంకులకు చేరాయని.. ఇది దేశంలో చలామణీలో ఉన్న రూ.2000 వేల నోట్లలో 76 శాతం అని ఆర్​బీఐ ప్రకటించింది.

Rs.2000 Notes Withdrawn
అప్పుడే ఆర్​బీఐకి చేరిన మూడోవంతు రూ.2000 నోట్లు.. ఇంకా మూడు నెలలు గడువు ఉండగానే..
author img

By

Published : Jul 3, 2023, 3:48 PM IST

Updated : Jul 3, 2023, 5:17 PM IST

2000 Notes Deposit : పెద్ద నోట్ల మార్పిడికి దాదాపు మూడు నెలల సమయం మిగిలి ఉండగానే బ్యాంకుల్లో 76 శాతం మేర రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) సోమవారం ఈమేరకు ప్రకటించింది. ఇందులో 87 శాతం నోట్లు వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ కాగా.. మిగతా 13 శాతాన్ని ఇతర నోట్లుగా మార్చుకున్నట్లుగా ఆర్​బీఐ తెలిపింది. మొత్తంగా రూ.2.72 లక్షల కోట్లు విలువగల రూ.2 వేల నోట్లను ప్రజలు ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్​ చేశారని వివరించింది.
చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఈ ఏడాది సెప్టెంబర్​ 30 వరకు దేశప్రజలకు గడువు ఇచ్చింది. వీటిన క్రమంగా ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది.

ఆ ఒక్కరోజే 0.84 లక్షల కోట్లు..
RBI On 2000 Notes : దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. 2023 మే 19 నుంచి జూన్​ 30 నాటికి మొత్తం రూ.2.72 లక్షల కోట్ల రూ.2000 కరెన్సీ నోట్లు వివిధ రూపాల్లో బ్యాంకుల్లో ప్రజలు జమ చేశారని ఆర్​బీఐ తెలిపింది. కేవలం జూన్​ 30 రోజునే స్టాక్​ మార్కెట్​ల సమయం ముగిసే సమయానికి రూ.0.84 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్​ అయ్యాయని ఆర్​బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఆర్​బీఐకి ఊరట..
Delhi High Court 2000 Note sc 2000 notes: చలామణీలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలన్న ఆర్​బీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. గుర్తింపు కార్డులు లేకుండా రూ.2000 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్​బీఐ, జాతీయ బ్యాంకు ఎస్​బీఐలు జారీ చేసిన నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ మే 29న దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)​ దాఖలైంది. దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలనే అభ్యర్థనను మే 30న రిజర్వ్​లో ఉంచిన చీఫ్ జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.2000 కరెన్సీ నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకునే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి లేదని.. ఆర్​బీఐ 1934 చట్టంలోని సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాలు ఉంటాయని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా తన పిటిషన్​లో పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది.

పిటిషన్​ తిరస్కరణ..
HC 2000 Notes : ఎటువంటి గుర్తింపు పత్రం లేకుండా రూ.2000 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్​బీఐ, జాతీయ బ్యాంకు ఎస్​బీఐలు జారీ చేసిన నోటిఫికేషన్‌లకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్​ కూడా ఇటీవలే తిరస్కరణకు గురైంది. సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ​ ఆర్​బీఐ నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Last Updated : Jul 3, 2023, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.