ETV Bharat / bharat

Rave Party in Hyderabad : మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత వెంకట్​ - హైదరాబాద్​లో రేవ్ పార్టీ భగ్నం

Rave Party in Hyderabad
Rave Party
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 6:36 AM IST

Updated : Aug 31, 2023, 11:49 AM IST

06:32 August 31

Rave Party Breaks Out in Madhapur : మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం

Rave Party in Hyderabad : సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోంది. గతంలో సిగరెట్‌, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి రేవ్ పార్టీ గబ్బు రేపింది. మాదాపూర్‌లో రేవ్ పార్టీని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పార్టీలో లభించిన డ్రగ్స్​ను సీజ్ చేశారు. నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఓ సినీ నిర్మాతతో పాటు ఐదుగురు ప్రముఖులు ఉన్నారని యాంటీ నార్కోటిక్స్(Telangana Anti Narcotics Bureau) అధికారులు వెల్లడించారు.

Rave Party Breaks Out in Madhapur : 'నగరంలో మాదాపూర్​ వద్ద విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు మాకు ముందస్తుగా సమాచారం అందింది. వెంటనే మేం టీమ్స్​ను అలర్ట్ చేశాం. పార్టీ మొదలయ్యే సమయానికి అక్కడికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కానీ మేం వెళ్లేసరికే అక్కడ చాలా మంది డ్రగ్స్ వినియోగిస్తూ మత్తులో తూలుతున్నారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నాం. వారు వినియోగిస్తున్న డ్రగ్స్(Drugs Seized Hyderabad)​ను సీజ్ చేశాం. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్​ను ఎవరు తీసుకువచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నాం. పార్టీ నిర్వాహకులు తెచ్చారా లేదా డ్రగ్ డీలర్స్​ ఎవరైనా పార్టీలో ఉన్నారా అనే విషయంపై కూపీ లాగుతున్నాం. ఈ రేవ్ పార్టీలో ఓ సినిమా నిర్మాత కూడా పట్టుబడ్డాడు. అతడితో పాటు మరో ఐదుగురు పేరు మోసిన ప్రముఖులు ఉన్నారు. వాళ్లందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించాం.' అని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.

Producer Venkat Arrested in Hyderabad Rave Party : ఈ రేవ్ పార్టీని సినీనిర్మాత వెంకట్ నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలోనూ ఓ చోట వెంకట్ నిర్వహించిన పార్టీ పై పోలీసులు దాడులు చేయగా... ఆయన తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వెంకట్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. రాత్రి పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే విఠల్‌రావ్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన దాడిలో వెంకట్‌ బృందం చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. మత్తు పదార్థాలతో పట్టుబడిన నిందితులను మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.... మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Hyderabad Rave Party Updates : మాదకద్రవ్యాల నిరోధక విభాగం వీరి నుంచి డ్రగ్స్‌ మూలాలపై ఆరా తీసే అవకాశం ఉంది. వెంకట్ బృందం నుంచి పోలీసులు కొకైన్ ఎల్​ఎస్​డీ, ఇతర మత్తు పదార్థాలు ఎంత మేరకు మేరకు స్వాధీనం చేసుకున్నారనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిర్మాత వెంకట్‌కు మాదకద్రవ్యాలు ఎవరు సరఫరా చేశారు...? ఇందులో నైజీరియన్ల పాత్ర ఉందా....? గతంలోనూ ఈ తరహా పార్టీలు వెంకట్‌ నిర్వహించారా....? ఆయన వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణాలు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు

Drugs Seized in Hyderabad Rave Party : రాష్ట్రంలో డ్రగ్స్​, సైబర్​ నేరాలు చాపకింద నీరులా విస్తరించిపోతున్నాయి. వాటిని నియంత్రించేందుకు కేసీఆర్ సర్కార్.. రాష్ట్రంలో రెండు కొత్త విభాగాలు ప్రారంభించింది. అవే నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలు. దేశంలో మరేక్కడా లేని విధంగా నాలుగు వేల మందితో ఈ బ్యూరోలను ఏర్పాటు చేసింది. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేందుకు, డ్రగ్స్​ నివారణకు యాంటీ నార్కోటిక్స్​ బ్యూరో చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డ్రగ్స్​ సరఫరా(Drugs Supply Hyderabad) కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది.

ఫామ్​హౌస్​లో సాఫ్ట్​వేర్​ బర్త్​డే పార్టీ.. 55 మందిపై కేసు..!

శివరాత్రి పూట రేవ్​పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..

Last Updated : Aug 31, 2023, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.