ETV Bharat / bharat

అరుదైన రెండు తలల పాము.. భక్తితో గ్రామస్థుల పూజలు.. - అరుదైన పాము

Two Headed Snake: ఛత్తీస్​గఢ్​లోని జంజ్​గిర్​చంపా జిల్లాలో గురువారం అరుదైన రెండు తలల పాము కనిపించింది. దానిని చూడడానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కొందరు గ్రామస్థులు ఏకంగా పూజలు చేశారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారు.

Two Headed Snake
Two Headed Snake
author img

By

Published : Jun 18, 2022, 5:38 PM IST

అరుదైన రెండు తలల పాము.. భక్తితో పూజించిన గ్రామస్థులు!

Two Headed Snake: ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉంటాయి. అయితే కొన్ని పాములు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఒకటి రెండు తలల పాము. తాజాగా ఛత్తీస్​గఢ్​లోని జంజ్​గిర్​ చంపా జిల్లాలో ఈ అరుదైన పాము కనిపించింది. అయితే దీనిని చూడడానికి గ్రామస్థులు, చుట్టుపక్క ప్రజలు తరలివచ్చారు. ఇలాంటి పామును చూడటం ఇదే తొలిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.

Two Headed Snake
రెండు తలలపాము

జిల్లాలోని బలోడా ప్రాతంలో గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో పరదేశి కన్వర్​ ఇంటి ఆవరణలో కనిపించింది. కొందరు గ్రామస్థులు భక్తితో ధూపదీపాలను వెలిగించి పూజలు కూడా చేశారు. అనంతరం ఆ పామును అడవిలో విడిచిపెట్టారు. అయితే ఇది అరుదైన సర్పం అని, చాలా నెమ్మదిగా కదులుతుందని పర్యావరణవేత్తలు తెలిపారు. వాటి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.

దీనిని 'రెడ్ సాండ్ బోవా స్నేక్' అని కూడా అంటారు. సాధారణంగా ఇసుక ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పాములు ఉంటాయి. మన దేశంలోని రాజస్థాన్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి సంఖ్య రానురాను తగ్గుతున్న దృష్ట్యా.. భారత ప్రభుత్వం దీనిని అరుదైన జాతుల జాబితాలో చేర్చింది. ఛత్తీస్‌గఢ్​లో ఈ పామును 'ముస్లేడి' అని కూడా అంటారు.

ఇవీ చదవండి: 106ఏళ్ల వయసులో 100 మీటర్ల రేస్.. బామ్మ పరుగుకు 'స్వర్ణం'

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.