ETV Bharat / bharat

'మేకు'ను మింగేసిన బాలుడు.. ఛాతిలో ఇరుక్కుని నరకం.. చివరకు... - అరుదైన శస్త్రచికిత్స

Rare Surgery in Bengal: వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. బంగాల్ సిలిగుడికి చెందిన ఓ బాలుడి ఛాతిలో మేకు ఇరుక్కోగా.. శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు.

Rare surgery
బాలుని గొంతులో ఇరుక్కున్న మేకు
author img

By

Published : Mar 17, 2022, 7:18 PM IST

Rare Surgery in Bengal: అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు బంగాల్​ వైద్యులు. ఛాతిలో మేకు ఇరుక్కుని తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలుడి ప్రాణాలు నిలిపారు.

Rare surgery
బాలుని ఛాతిలో ఇరుక్కున్న మేకు

సిలిగుడికి చెందిన మూడేళ్ల మహమ్మద్​ అరిస్​ ప్రమాదవశాత్తు మేకును మింగాడు. ఛాతిలో మేకు ఇరుక్కోగా.. శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో బుధవారం రాత్రి నార్త్ బంగాల్ వైద్య కళాశాల ఆస్పత్రి​లో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం.. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఆపరేషన్​ విజయవంతంగా నిర్వహించి బాలుడి ప్రాణాలు నిలిపింది.

Rare surgery
మేకు తొలగింపునకు అరుదైన శస్త్రచికిత్స

ఆపరేషన్​ చాలా కష్టతరమైందని డాక్టర్ బంధోపాధ్యాయ చెప్పారు. ప్రస్తుతం బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. గత నెలలోనూ ఇలాంటి ఓ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. గొంతులో వెదురు కర్ర ఇరుక్కున్న ఓ మహిళకు శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నారు.

Rare surgery
బాలుని ఛాతిలో ఇరుక్కున్న మేకు

ఇదీ చదవండి: పుట్టిన బిడ్డను భూమిలో పాతేసిన తల్లి... శిశువు ఏడుపు విని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.