సాధారణంగా ఆవు దూడలు రెండు కళ్లు, ఓ తలతో పుడతాయి. కానీ ఒడిశా నవరంగ్పుర్ జిల్లాలోని రాయ్‌గఢ్ ప్రాంతంలో మాత్రం అరుదైన లేగదూడ జన్మించింది. రెండు తలలు(Two-Headed Calf), రెండు నాలుకలు, మూడు కళ్లతో పుట్టిన ఈ దూడ వింతగా ఉండి చూసేందుకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు బిజపుర ప్రాంతానికి తరలివస్తున్నారు. నవరాత్రుల సమయంలో పుట్టినందున చాలా మంది దీనిని దుర్గామాతా ప్రతిరూపంగా కొలుస్తున్నారు. పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ వింత దూడకు జన్మనిచ్చిన గోవును తాను రెండేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు యజమాని ధనిరామ్ గండ. ఈ నవజాత శిశువుకు పాలు ఇవ్వడం తల్లికి ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. సాధారణంగా ఇలాంటి పిల్లలు పుట్టిన కొద్దిసేపటికే చనిపోతుంటాయి. కానీ ఈ దూడ మాత్రం చాలా ఆరోగ్యం ఉన్నట్లు యజమాని తెలిపారు.
ఇదీ చూడండి:ఎలక్ట్రీషియన్ వింత ప్రవర్తన- ట్రాన్స్ఫార్మర్కు మద్యంతో అభిషేకం