ETV Bharat / bharat

6 కోట్ల ఏళ్ల నాటి రాతి స్తంభాలు మహారాష్ట్రలో లభ్యం - మహారాష్ట్ర వార్తలు తాజా

మహారాష్ట్రలోని యవత్మాల్​ జిల్లాలో దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటి లావా రాతి స్తంభాలను పరిశోధకులు గుర్తించారు. యవత్మాల్‌ ప్రాంతం భౌగోళికంగా అతి పురాతనమైనదని, ఇదే ప్రాంతంలో 20 కోట్ల ఏళ్ల నాటి రాతి పొరలను కూడా గుర్తించినట్టు నిపుణులు వెల్లడించారు.

rare basalt rocks, లావా రాతి స్తంభాలు
6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు!
author img

By

Published : Jul 3, 2021, 8:04 AM IST

దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ రాళ్లు సందర్శకులు, పరిశోధకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఉబికొచ్చే లావా ప్రవాహం.. మార్గమధ్యంలో ఎక్కడైనా నదిలోకి జారినప్పుడు ఒక్కసారిగా చల్లబడుతుంది. పరిమాణం కుదించుకుపోయి షడ్బుజాకార ఘన పదార్థంగా నిలిచిపోతుంది. అదే క్రమంగా రాతి స్తంభాలుగా మారిపోతుంది' అని భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సురేష్‌ చోపనే చెప్పారు.

"మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 7 కోట్ల ఏళ్ల క్రితం సముద్రం ఉండేది. భౌగోళిక మార్పులతో అది మాయమై పశ్చిమ కనుమలు ఉద్భవించాయి. 6కోట్ల ఏళ్ల క్రితం యవత్మాల్‌ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. భారీ డైనోసార్లు లాంటివి ఇక్కడ తిరిగేవి. ఆ కాలంలో (క్రెటేషియన్‌) మరోసారి విపరీతమైన భౌగోళిక మార్పులు సంభవించాయి. పశ్చిమ కనుమల పగుళ్ల నుంచి పొంగిన లావా విదర్భ నుంచి గుజరాత్‌ వరకు ప్రవహించింది. దీంతో నాటి అడవులు, జీవజాలం అంతా బూడిదైంది. మహారాష్ట్రలో 80 శాతం రాతి శిలలన్నీ అప్పటి లావా ప్రవాహంతో ఏర్పడినవే. ముంబయి, కొల్హాపుర్‌, నాందేడ్‌లోనూ ఇలాంటి రాతి శిలలున్నాయి."

-సురేష్‌ చోపనే, భూవిజ్ఞాన శాస్త్రవేత్త

యవత్మాల్‌ ప్రాంతం భౌగోళికంగా అతి పురాతనమైనదని, ఇదే ప్రాంతంలో 20 కోట్ల ఏళ్ల నాటి రాతి పొరలను కూడా గుర్తించినట్టు సురేష్​ చోపనే తెలిపారు.

ఇదీ చదవండి : అమ్మో.. 107 విష సాలీడులు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.