ETV Bharat / bharat

మహిళపై దంపతుల అత్యాచారం- వీడియో తీసి బ్లాక్​మెయిల్​!

Rape Case in Maharastra: మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన కేసులో దంపతులను కోల్​కతాలో పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో రన్నింగ్ ట్రైన్​లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.

RAPE CASES in maharastra
అత్యాచారం
author img

By

Published : Jan 23, 2022, 12:17 PM IST

Rape Case in Maharastra: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, బ్లాక్‌మెయిల్​తో ఆమె నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసినందుకు దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

'మహారాష్ట్ర నాగ్​పరా​ పోలీసు స్టేషన్​లో నిందితులపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయగా అతడి భార్య వీడియో తీసింది. 2015లోనే ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ బాధిత మహిళ నుంచి రూ.కోటిపైనే వసూలు చేశారు.'అని పోలీసులు తెలిపారు.

బాధితురాలు కేసు నమోదు చేయగానే నిందితులు ముంబయి నుంచి పారిపోయారు. ఇరువురూ బంగాల్ వెళ్లినట్లు పసిగట్టిన పోలీసులు.. కోల్​కతా పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు.

రన్నింగ్ ట్రైన్​లో లైంగిక దాడి..

Woman Molested In Running Train: బంగాల్ దక్షిణ పరగణాల జిల్లాలో దారుణం జరిగింది. లోకల్​ ట్రైన్​లో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

'సాయంత్రం ఆరుగంటల సమయంలో శాంతిపుర్​- సీల్దా రైలు ఎక్కింది మహిళ. ఆమె టాటూ ఆర్టిస్ట్​గా పనిచేస్తుంటారు. రైలు డుండుం స్టేషన్ రాగానే మహిళల కంపార్ట్​మెంట్​లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఓ వ్యక్తి రైలు ఎక్కాడు. బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే బాధిత మహిళ ఫేస్​బుక్ లైవ్​ను ఆన్​ చేసింది. ఈ వీడియో, సీసీటీవీ ఆధారంగా నిందితున్ని అరెస్టు చేశాం' అని పోలీసులు తెలిపారు.

యావజ్జీవ కారాగార శిక్ష..

Rape Case In Odisha: పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ జంటకు కఠిన శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. భర్తకు యావజ్జీవం.. భార్యకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

ఒడిశా కటక్​లో అమిత్ బిందాని(45) అనే వ్యక్తి 2019లో మురికివాడల్లో ఉండే ఓ బాలికను అతని భార్య సహకారంతో అపహరించాడు. అనంతరం ఆ బాలికను జంషెడ్​పుర్​కు తీసుకువెళ్లారు. బాలికపై అమిత్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: వృద్ధ యాచకులపై కానిస్టేబుల్ దాడి- వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.