ETV Bharat / bharat

Ramoji Film City MICE Delhi 2023 : దిల్లీలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్.. ఆసక్తిగా తిలకించిన రష్యా టూరిస్ట్​లు! - మైస్​ దిల్లీ టూరిజం ఈవెంట్​

Ramoji Film City MICE Delhi 2023 : దిల్లీలో మైస్​-2023 పేరుతో ఏర్పాటు చేసిన టూరిజం ప్రమోషన్​ ఈవెంట్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ను స్టూడియో ప్రతినిధులు ఏర్పాటు చేశారు. భారత్​- రష్యాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు వచ్చారు. రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ramoji film city mice delhi 2023
ramoji film city mice delhi 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:57 PM IST

Updated : Sep 30, 2023, 6:46 AM IST

Ramoji Film City MICE Delhi 2023 : భారత్, రష్యాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దిల్లీలో ఏర్పాటు చేసిన మైస్-2023 (MICE 2023 Delhi) కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​ను స్టూడియో ప్రతినిధులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ స్టాల్​ను చూసేందుకు విచ్చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఫీచర్లు, అక్కడ ఉండే ఏర్పాట్లు వంటి వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్​లో అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగా నిలుస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి.. స్టూడియో ప్రతినిధులు.. సందర్శకులకు వివరించారు.

సినిమా షూటింగ్​లు, వివాహాలు, కార్పొరేట్ సమావేశాలు, వ్యాపార సదస్సులకే కాకుండా.. అన్ని రకాల కార్యక్రమాలకు రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్ఎఫ్​సీ) గమ్యస్థానంగా మారిపోయిందని ఆర్ఎఫ్​సీ సీనియర్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) టీఆర్ఎల్ రావు పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటివరకు 3,500 సినిమాల షూటింగ్​లు జరిగాయని చెప్పారు. ప్రతి ఏటా 350 నుంచి 400 సదస్సులు జరుగుతాయని వివరించారు.

రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​

"రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి ఏడాది 100 నుంచి 125 వివాహాలు జరుగుతాయి. ప్రతి ఏడాది 20 లక్షల మంది ఫిల్మ్ సిటీ సందర్శనకు వస్తుంటారు. పర్యటకులు రెండు నుంచి మూడు రోజుల పాటు ఫిల్మ్ సిటీలోని వివిధ హోటళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ రికార్డుల్లోనూ ఆర్ఎఫ్​సీ పేరు సంపాదించింది. వెడ్డింగ్ ప్లానర్లు, మెస్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది.. సందర్శకులను ఆహ్వానించేందుకు ఏడాదంతా అందుబాటులో ఉంటారు."
--టీఆర్ఎల్ రావు, రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)

ఆర్ఎఫ్​సీకి వచ్చే సందర్శకుల సంఖ్య ఏటా పెరుగుతోందని టీఆర్ఎల్ రావు తెలిపారు. ఇక్కడికి వచ్చినవారంతా మంచి వసతులను ఎంజాయ్ చేసి వెళ్తారని పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ స్టాల్​ను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్​ఎఫ్​సీ గురించి ప్రచారం చేసుకునే అవకాశం లభించిందని వివరించారు. ఇదే సమయంలో రష్యా పర్యాటకం గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అక్కడి అవకాశాల గురించి కూడా తెలుసుకున్నట్లు వివరించారు. ఆ దేశస్థులకు సైతం రామోజీ ఫిల్మ్ సిటీ గురించి వివరించి, కరపత్రాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

కాగా, దిల్లీలోని కార్కార్డూమా హోటల్​లో శుక్రవారం నిర్వహించిన మైస్-2023 కార్యక్రమంలో మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్గెనీ కోజ్లోవ్ పాల్గొన్నారు. మైస్-2023 కార్యక్రమం గురించి, మాస్కోలో పర్యాటకం గురించి ఆయన మాట్లాడారు. మాస్కోలో భారతీయ వ్యాపారుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు సైతం మాస్కోను తమ ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని చెప్పారు.

రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి

Ramoji Filmcity: ఈట్‌ రైట్‌ క్యాంపస్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీ

Last Updated : Sep 30, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.