ETV Bharat / bharat

50 రోజుల్లో 3వేల కి.మీ. పరుగు- గిన్నిస్​ రికార్డే లక్ష్యం! - హరియాణా యువకుడు రామేశ్వరం

గిన్నిస్​ రికార్డే లక్ష్యంగా హరియాణాకు చెందిన ఓ యువకుడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధపడ్డాడు. ఈ పరుగును కేవలం 50 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాడు.

rameshwaram to ayodhya run
గిన్నిస్​ రికార్డే లక్ష్యంగా.. 50 రోజుల్లో 2911 కిలోమీటర్లు!
author img

By

Published : Oct 8, 2021, 7:51 PM IST

Updated : Oct 8, 2021, 9:00 PM IST

గిన్నిస్​ రికార్డే లక్ష్యంగా.. 50 రోజుల్లో 2911 కిలోమీటర్లు!

హరియాణాకు చెందిన ఓ యువకుడు ప్రపంచ రికార్డును నెలకొల్పాలని భావించాడు. అందుకోసం పెద్ద లక్ష్యాన్నే ఎంచుకున్నాడు. గిన్నిస్​ రికార్డులో స్థానం సంపాదించేందుకు అతను సుమారు మూడు వేల కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధపడ్డాడు. నరేంద్ర సింగ్​.. తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యకు గురువారం పరుగును ప్రారంభించాడు.

rameshwaram to ayodhya run
నరేంద్ర సింగ్​

రామేశ్వరం నుంచి మొదలుకొని అయోధ్య వరకు మొత్తం 2911 కిలోమీటర్లు పరిగెత్తాలన్నది నరేంద్ర సింగ్ లక్ష్యం. అంతేకాదు.. ఈ పరుగును కేవలం 50 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాడు. నరేంద్ర సింగ్​ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజుకు సగటున 50 కిలోమీటర్లకుపైన పరిగెత్తాల్సి ఉంటుంది.

rameshwaram to ayodhya run
పరుగు ప్రారంభించిన నరేంద్ర సింగ్​

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే.. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం టవర్​ గేట్​ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి : 17ఏళ్లుగా అడవిలోనే ఒంటరి జీవనం- కారులోనే నివాసం

Last Updated : Oct 8, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.