ETV Bharat / bharat

'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం' - అయోధ్య రామాలయ నిర్మాణ కార్యక్రమాలు

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో చారిత్రక రామాలయ నిర్మాణం కోసం.. దేశీయ నిధుల్ని మాత్రమే స్వీకరిస్తామని ఆలయ ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. విదేశీ విరాళాలను సేకరించేందుకు కేంద్రం అనుమతి లభించలేదని ఆయన చెప్పారు.

Ram temple to be built using only domestic funds: Trust
'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం'
author img

By

Published : Dec 16, 2020, 8:31 PM IST

అయోధ్యలో రామ మందిరాన్ని దేశ ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే నిర్మిస్తామని ఆలయ ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. విదేశీయుల ద్వారా నిధులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆయన చెప్పారు. ఈ విరాళాల కోసం.. రూ.10, 100, 1,000 విలువ గల కూపన్లను కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అయితే.. నిధుల సేకరణ కోసం తాము ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదని స్పష్టం చేశారు రాయ్​.

రామ భక్తుల నుంచి దేశవ్యాప్తంగా సేకరించే ఈ విరాళాల కోసం త్వరలోనే ఓ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు రాయ్​. దీంతో ఇప్పటికే పూర్తైన ఆలయ నమూనా చిత్రాలు కోట్ల మందికి చేర్చడం సహా.. చారిత్రక ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: రామాలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.