Ram Mandir Invitation : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీని వేగవంతం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ప్రతి ఒక్క అతిథి వద్దకు తమ ప్రతినిధులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. తమ ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో ఉన్న వాలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నట్లు తెలిపాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS), విశ్వ హిందూ పరిషత్ (VHP), సహా ఇతర అనుబంధ సంఘాలు ఆహ్వాన పత్రికల పంపిణీలో సాయం చేస్తున్నట్లు వివరించాయి. ఇప్పటికే అనేక మంది అతిథులు ఆహ్వాన పత్రికలు అందుకున్నట్లు చెప్పాయి.
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించే ఈ ఆహ్వాన పత్రికలో నూతనంగా నిర్మితమవుతున్న ఆలయం, రాముడి చిత్రాలు కనిపిస్తాయి. దీంతో పాటు రామ జన్మభూమి పోరాటంలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల వివరాలతో కూడిన బుక్లెట్ను అందించనున్నారు. ఆలయ ట్రస్ట్ ఆహ్వానిత జాబితాలో సుమారు 7వేల మంది ఉన్నారు. వీరిలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.
-
Maharashtra CM Eknath Shinde receives an invitation to attend the 'Pran Pratishtha' ceremony of Ram Temple on January 22nd in Ayodhya. pic.twitter.com/308knMKOff
— ANI (@ANI) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maharashtra CM Eknath Shinde receives an invitation to attend the 'Pran Pratishtha' ceremony of Ram Temple on January 22nd in Ayodhya. pic.twitter.com/308knMKOff
— ANI (@ANI) January 8, 2024Maharashtra CM Eknath Shinde receives an invitation to attend the 'Pran Pratishtha' ceremony of Ram Temple on January 22nd in Ayodhya. pic.twitter.com/308knMKOff
— ANI (@ANI) January 8, 2024
"వివిధ రంగాలకు చెందిన వారిని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అంతరిక్షం రంగం నుంచి కళలతో పాటు కొన్ని తెగలు, శిల్పులు, ఇతర రంగాల్లోని ప్రముఖులను పిలుస్తున్నాం."
--ట్రస్ట్ సీనియర్ సభ్యుడు
విదేశీ అతిథులకు స్వయంగానే!
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీకి ఆహ్వాన పత్రికలు అందజేశారు ట్రస్టు ప్రతినిధులు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. వీరితో పాటు దేశవ్యాప్తంగా సుమారు 4,000 మంది సాధువులు, 50 మంది విదేశీయులను ఆహ్వానించనున్నారు. విదేశాల్లోని అతిథులకు సైతం స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇస్తామని ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. భారత్లో ఉన్న విధంగానే విదేశాల్లోనూ తమ నెట్వర్క్ వ్యాపించిందని, ఇతర దేశాల్లో కూడా తమకు వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. దీంతో ప్రతి ఒక్క అతిథికి డెలివరీ సర్వీస్ ద్వారా కాకుండా స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తామన్నారు. భారత్ నుంచి విదేశాల్లోని వాలంటీర్లకు పత్రికలు పంపుతున్నామని, వారు అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి అందజేస్తారని వివరించారు.
-
Ram Janmbhoomi Teerth Kshetra Trust shares pictures of Ram Temple premises as it looks during the night. pic.twitter.com/2RPXVUBebA
— ANI (@ANI) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ram Janmbhoomi Teerth Kshetra Trust shares pictures of Ram Temple premises as it looks during the night. pic.twitter.com/2RPXVUBebA
— ANI (@ANI) January 8, 2024Ram Janmbhoomi Teerth Kshetra Trust shares pictures of Ram Temple premises as it looks during the night. pic.twitter.com/2RPXVUBebA
— ANI (@ANI) January 8, 2024
మరోవైపు రామజన్మభూమి-బాబ్రీ మసీద్ కేసులో పిటిషనర్ ఇక్బాల్ అన్సారీకి సైతం ఆహ్వాన పత్రికను అందజేశారు. అయోధ్య రామ్పథ్లోని ఆయన ఇంటికి వెళ్లి మరీ ట్రస్ట్ సభ్యులు పత్రికను అందించారు. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో సీతారాముల పాత్రలను పోషించిన నటులు అరుణ్ గోవిల్, దీపికా చిఖిలియాను ఆహ్వానించారు. రామజన్మభూమి పోరాటంలో ప్రాణాలు అర్పించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను పిలుస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే చెప్పారు.
'మా ఇంట్లో రాముడు పుట్టాలి, ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయండి'- వైద్యులను కోరుతున్న గర్భిణులు