Ram Mandir In Meerut : రావణుడి అత్తమాల నగరంలో ఉన్న ఓ రామ మందిరానికి 35 ఏళ్లుగా భక్తులెవరూ వెళ్లలేదు. పూజారి ఒక్కరే ప్రతి రోజు ఆ ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. 1987 నుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని అర్చకుడు తెలిపారు. ఇంతకీ ఈ ఆలయానికి భక్తులు వెళ్లకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ జరిగింది.. లంకాధిపతి రావణుడి అత్తమామల నగరంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోని స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల కాలనీలో 1962లో ఓ రామాలయాన్ని నిర్మించారు. కృష్ణుడి విగ్రహంతో పాటు శివలింగం కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఈ గుడి కళకళలాడింది. అయితే 1987లో మేరఠ్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలకు భయపడి ఆలయ సమీపంలో ఉన్న హిందువులు తమ ఇళ్లను ఖాళీ చేసి నగరంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లిపోయారు. అలా కొన్నేళ్లు గడిచాక ఈ ఆలయం ఉందన్న విషయం కూడా నగరవాసులకు తెలియకుండా పోయింది.
1987 నుంచి ఆలయ సమీపంలో ఒక్క హిందూ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. 1989లో ఓ పూజారి కుటుంబం అక్కడికి వచ్చి స్థిరపడింది. అప్పటి నుంచి ఆ అర్చకుడు పూజలు నిర్వహించారు. ఆయన 2014లో చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన కుమారుడు ఆచార్య బాల్ గోవింద్ జోషి గుడి బాగోగులు చూసుకుంటున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా నగరంలో వేరే చోట ఉంటున్నారు. దీంతో ప్రతి రోజు పూజారి ఒక్కరే గుడిని శుభ్రం చేస్తూ.. పూజలు నిర్వహిస్తున్నారు.
"గత 35 ఏళ్లలో ఆలయానికి భక్తులెవరూ రాలేదు. 32 పళ్ల మధ్య నాలుక ఉన్నట్లు తయారైంది నా పరిస్థితి. రామ మందిరం సమీపంలో ఇస్లామాబాద్, రెహ్మత్పురా, హాపుర్ రోడ్ ఉన్నాయి. ఆలయానికి 3 కిలోమీటర్ల మేర ఒకే వర్గానికి చెందిన వారు ఉంటారు."
--ఆచార్య బాల్ గోవింద్ జోషి, రామాలయ పూజారి.
అనుకోకుండా ఆలయ పునరుద్ధరణ..
ఇదిలా ఉండగా నగరంలో మిఠాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రాధేదాస్ అనే వ్యక్తి.. ఆ ప్రాంతంలోని ఓ స్నేహితుడి ఇంటికి విందు కోసం వచ్చారు. ఈ క్రమంలో ఈ బోసిపోయిన ఆలయాన్ని చూశారు. అనంతరం పూజారి వద్ద ఆ గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తన స్నేహితుల సహాయంతో ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ముందుకొచ్చారు. అందులో భాగంగా తన సహచరులతో కలిసి తన సామర్థ్యం మేరకు రంగులు వేయడం వంటి పనులు చేయిస్తున్నారు.
800 ఏళ్ల నాటి శివాలయంలో మహిళలే అర్చకులు.. పది తరాలుగా ఘనంగా పూజలు!
షిర్డీ సాయికి 'కాయిన్స్ కష్టాలు'.. నాణేలతో బ్యాంకులు ఫుల్.. టన్నుల కొద్దీ నిల్వలు!