Ram Lalla Idol Provided With Blankets: దేశం చలికి వణుకుతోంది. ఉత్తరాదిలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగజలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊలు దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచించినట్లున్నారు అయోధ్య ఆలయ నిర్వహకులు. ఆలయాల్లో దేవతామూర్తులకు చలేయకుండా వెచ్చని దుస్తులతో కప్పి ఉంచారు.
Winter Effect on Temples: అయోధ్యలోని అన్ని ఆలయాల్లో ఇప్పుడు ఇదే తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయోధ్య ప్రధాన ఆలయంతో పాటు శ్రీ రామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ ఘర్, నగేశ్ వార్నాత్ దేవాలయాల్లో దేవత విగ్రహాలపై దుప్పట్లు, ఉన్ని దుస్తులు, శాలువాలు దర్శనమిస్తున్నాయి.
"అయోధ్యలో శ్రీరాముడు సహా దేవతా విగ్రహాలకు గతం నుంచే దుప్పట్లు, ఉన్ని దుస్తులను కప్పుతున్నాము. దేవతామూర్తులు నిద్రించడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దేవుడి కోసం ఓ భక్తుడు రెండు దుప్పట్లను, స్వెటర్లను తయారు చేసి ఇచ్చారు. రామ్లల్లాలోని తాత్కాలిక భవనంలో రామలక్ష్మణులను ఒక చోట, భరత-శత్రుజ్ఞులను మరో చోట నిద్రపుచ్చుతున్నాము. దేవుడికి చలేయకుండా రాత్రంతా వేడిగాలి తగిలేలా మరలను ఉపయోగిస్తున్నాము."
-ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్‌లల్లా ప్రధాన పూజారి
Ayodhya Ram Mandir News: రామజన్మభూమి కాంప్లెక్స్‌లో సోదరులతో సహా బాల శ్రీరాముడు సేవలు అందుకుంటున్నాడు. రామ్‌లల్లాలో నలుగురు సోదర దేవతామూర్తులను ఉన్ని దుస్తులతో కప్పేశారు. వెండి ప్లేట్‌పై దుప్పట్లను కప్పి దానిపై విగ్రహాలను ఉంచి సేవలు చేస్తున్నారు. సుఖంగా నిద్రించడానికి దోమ తెరలను ఉపయోగించారు.
ఇదీ చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ సాయి దర్శనం టైమింగ్స్‌లో కీలక మార్పులు
హిమవీరులారా మీకు సలాం.. రక్తం గడ్డ కట్టే చలిలోనూ దేశం కోసం...