ETV Bharat / bharat

రాజ్యసభ ప్రోడక్టివిటీ 99 శాతం: వెంకయ్య - Budget session of Rajya Sabha 2021

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో.. రాజ్యసభ తొలి అర్ధభాగంలో 99 శాతం ప్రోడక్టివిటీ సాధించిందని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అన్నారు. ఈ వారం మొత్తంగా 45 గంటల 4 నిమిషాలు చర్చా సమావేశాలు జరిగాయన్న ఆయన.. ఈ పనికాలం 113శాతంగా నమోదైనట్టు పేర్కొన్నారు.

Rajya Sabha clocks 99% productivity as 1st part of Budget session ends
ప్రథమార్ధం బడ్జెట్​ సమావేశాల్లో రాజ్యసభ పనికాలం 99%
author img

By

Published : Feb 12, 2021, 9:39 PM IST

Updated : Feb 12, 2021, 9:49 PM IST

పార్లమెంట్​ రెండు విడతల బడ్జెట్​ సమావేశాల్లో రెండు వారాలపాటు సాగిన తొలి భాగంలో.. రాజ్యసభ 99 శాతం ప్రోడక్టివిటీ సాధించిందని ఛైర్మన్​ ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఏప్రిల్​ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్​పై విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం.. సభ మరో మూడు వారాలకు వాయిదా పడింది. అయితే.. వివిధ మంత్రిత్వ శాఖలకు బడ్జెట్​ కేటాయింపులను పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీలు ఈ విరామాన్ని అనుమతిస్తాయి. ద్వితీయార్ధం బడ్జెట్​ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

మొత్తంగా.. ఈ వారంలో ఎగువసభ పనికాలం 113 శాతంగా నమోదైనట్టు పేర్కొన్నారు వెంకయ్య. షెడ్యూల్​ ప్రకారం మొత్తం చర్చా కాలం 45గంటల 4నిమిషాల పాటు కొనసాగిందని, అంతరాయాల కారణంగా అరగంట సమయం వృథాగా పోయిందన్నారు. అయితే.. తొలి వారంలో ఇది కేవలం 82 శాతానికే పరిమితమైందని చెప్పారు. ఆ వారం షెడ్యూల్లో 27 గంటల 11నిమిషాల పాటు చర్చలు జరిగినట్టు తెలిపారు వెంకయ్య. మొత్తం కార్యాచరణ సమయంలో.. 60శాతానికిపైగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం, బడ్జెట్​ అంశాలపైనే చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు. కేవలం ఈ రెండు అంశాలపైనే 100 మంది సభ్యులు మాట్లాడారన్నారు.

రెండు వారాల ఈ సమావేశంలో.. మూడు బిల్లులు ఆమోదం పొందాయని వెంకయ్య పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి మొత్తం 88 సమస్యలు లేవనెత్తినట్టు తెలిపారాయన.

ఇదీ చదవండి: ఆ రెండు రోజులు లోక్​సభ పనికాలం 150శాతం!

Last Updated : Feb 12, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.