Rajouri Encounter Today : ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. మరికొందరు సైనికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగింది. ఇంకా ఇరువైపుల నుంచి భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాజౌరీ జిల్లాలోని బాజిమాల్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్న సైనికులపై... ముష్కరులు కాల్పులు జరపటం వల్ల ఎన్‌కౌంటర్ మొదలైనట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికాధికారులు, మరో ఇద్దరు జవాన్లు గాయపడగా... వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వారు చనిపోయినట్లు సైనికాధికారులు ప్రకటించారు.
-
Four Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter with terrorists in Rajouri area of J&K: 16 Corps sources
— ANI (@ANI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Four Army personnel including two officers and two jawans have lost their lives in an ongoing encounter with terrorists… pic.twitter.com/pHRKshYtqz
">Four Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter with terrorists in Rajouri area of J&K: 16 Corps sources
— ANI (@ANI) November 22, 2023
Four Army personnel including two officers and two jawans have lost their lives in an ongoing encounter with terrorists… pic.twitter.com/pHRKshYtqzFour Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter with terrorists in Rajouri area of J&K: 16 Corps sources
— ANI (@ANI) November 22, 2023
Four Army personnel including two officers and two jawans have lost their lives in an ongoing encounter with terrorists… pic.twitter.com/pHRKshYtqz
అడవిలో ఇద్దరు ఉగ్రవాదులు కనిపించినట్లు అధికారులు చెప్పారు. వీరిని పట్టుకునేందుకు బుధవారం మరిన్ని దళాలను రంగంలోకి దింపగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారని వివరించారు. ఓ ప్రార్థనా స్థలాన్ని ఆవాసంగా ఉపయోగించుకున్నారని తెలిపారు. గత కొన్ని ఎన్‌కౌంటర్ల తర్వాత నుంచి పీర్‌పంజాల్ అడవులు భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారాయి. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఉగ్రవాదులు స్థావరంగా మార్చుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని స్థానికులు చెప్పారు. అందువల్ల కనీసం బయటకు రాలేకపోతున్నామని.. పిల్లలు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు.
జమ్ములో ఒక్క ఏడాదిలోనే 47 మంది మృతి
15 మంది భద్రతా బలగాలు సహా 47 మంది ఈ ఏడాది కాలంలో జమ్ములో జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మూడు జిల్లాలో కలిపి 25 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. తాజాగా రాజౌరిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారితో కలిపి 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇటీవల పూంచ్, కంది అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు కమాండోలతో సహా 10 మంది సైనికులు మరణించారని వివరించారు. రాజౌరిలో 24 మంది, పూంచ్‌లో 15, రియాస్లో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. జమ్ముకశ్మీర్ మొత్తంగా చూస్తే 121 మంది మరణించారు. ఇందులో 81 మంది ఉగ్రవాదులు, 27 మంది భద్రతా బలగాలు చనిపోయారు.