ETV Bharat / bharat

మూడు రోజుల పాటు లద్దాఖ్​లో రక్షణ మంత్రి పర్యటన - national news in telugu

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు లద్ధాఖ్​లో పర్యటించనున్నారు. తూర్పు లద్ధాఖ్​ సరిహద్దు వద్ద పరిస్థితులపై సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో రాజ్​నాథ్​.. బార్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని రక్షణ మంత్రిత్వ కార్యాలయం వెల్లడించింది.

rajnath singh ladakh trip, రాజ్​నాథ్​ సింగ్​ లద్ధాఖ్​ పర్యటన
నేటి నుంచి రక్షణ మంత్రి లద్దాఖ్​ పర్యటన
author img

By

Published : Jun 27, 2021, 6:18 AM IST

Updated : Jun 27, 2021, 6:46 AM IST

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేడు లద్దాఖ్ ​వెళ్లనున్నారు. తూర్పు లద్దాఖ్​లోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు బలగాల సన్నద్ధతను సమీక్షించనునన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎంఎం నరవాణే కూడా పాల్గొననున్నారు. సరిహద్దు ప్రతిష్టంభనపై చైనాతో చర్చలు జరిగిన రెండు రోజులకే రక్షణ మంత్రి ఈ పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పాంగాంగ్​ సరస్సు నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకున్నాక రాజ్​నాథ్​ తూర్పు లద్దాఖ్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రాజ్​నాథ్​.. బార్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని రక్షణ మంత్రిత్వ కార్యాలయం వెల్లడించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాజ్​నాథ్​ పలు కీలక ప్రాంతాలను సందర్శించనున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 14 కార్ఫ్స్​ ప్రధాన కార్యాలయంలో రాజ్​నాథ్​కు సైన్యం.. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను వివరించనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి : 'వచ్చే ఏడాదికి స్వదేశీ విమాన వాహక నౌక'

Last Updated : Jun 27, 2021, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.