ETV Bharat / bharat

టీచర్స్​ డే రోజే ప్రధానోపాధ్యాయుడిపై కేసు.. కారణమేంటి? - Civil Dress

విద్యాబుద్ధులు నేర్పే గురువు విద్యార్థులకు దేవుడితో సమానం. ఆ గురువును స్మరించుకునే రోజు(Teachers day) ఇది. ఓవైపు యావత్​ భారతావని ఉపాధ్యాయుల త్యాగాన్ని స్మరించుకుంటున్న తరుణంలో.. మధ్యప్రదేశ్​ రాజ్​గఢ్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థులే కేసు పెట్టారు. ఆ గురువు చేసిన తప్పేంటి?

teachers-day
టీచర్స్​ డే రోజే స్కూల్​ ప్రిన్సిపాల్​పై కేసు
author img

By

Published : Sep 5, 2021, 5:37 PM IST

దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం(Teachers day 2021) ఘనంగా నిర్వహించుకుంటోంది. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశిస్సులు తీసుకుంటున్నారు. కానీ, మధ్యప్రదేశ్​, రాజ్​గఢ్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఇంతకి ఏం జరిగింది? ఆయన చేసిన తప్పేంటి?

రాజ్​గఢ్​ జిల్లాలోని మచల్​పుర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు బాలికలు యూనిఫాం కాకుండా సివిల్​ డ్రెస్​లో వచ్చారు. అది ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్​ మాలవియాకు నచ్చలేదు. విద్యార్థినులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగు బట్టలు ధరించిన విద్యార్థినులంతా.. సోమవారం నుంచి బట్టలు లేకుండా బడికి రావాలని ఆదేశించారు. సివిల్​ డ్రెస్​లో వచ్చి బాలురను చెడగొడుతున్నారని తిట్టారు. ఉపాధ్యాయుడి మాటలు విన్న విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు.

teachers-day
పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థినులు

ఉపాధ్యాయుడి మాటలపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర తరగతుల విద్యార్థినులతో కలిసి పాఠశాలలో నిరసనకు దిగారు. స్కూల్​ నుంచి పోలీస్​ స్టేషన్​కు ర్యాలీగా తరలి వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలోనూ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్​ మాలవియాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్​ ఇంఛార్జి జితేంద్ర అజ్నారే తెలిపారు.

ప్రస్తుతం ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్​ చేశారు.

ఇదీ చూడండి: 'ఉత్తమ ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.