ETV Bharat / bharat

బ్లేడ్​తో విద్యార్థిని గొంతు కోసి.. ఆస్పత్రి వరకు వెంబడించి..

పాఠశాలలో విద్యార్థిని గొంతును బ్లేడ్​తో కోశాడు ఓ బాలుడు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్​లోని పాలీ జిల్లాలో జరిగింది.

student slit girl throat in Pali
రాజస్థాన్​లో బాలిక గొంతు కోసిన బాలుడు
author img

By

Published : Nov 23, 2021, 6:43 PM IST

రాజస్థాన్​లోని పాలీ జిల్లాలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. పాఠశాలలో బ్లేడ్​తో విద్యార్థిని గొంతు కోశాడు ఓ బాలుడు.

బితోఢ కలాన్​ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో యశోదా మీనా తొమ్మిదవ తరగతి చదువుతోంది. మంగళవారం లంచ్ సమయంలో బాలిక తరగతి బయటికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె దగ్గరికి 12వ తరగతి చదవుతున్న సోహన్​లాల్​ మీనా వచ్చాడు. చేతిలో అప్పటికే వెంటతెచ్చుకున్న బ్లేడ్​తో బాలిక మెడను కోశాడు.

బాలికపై నిందితుడి ఆరా..

ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు.. బాధితురాలిని వెంటనే మార్వాఢ్​ జంక్షన్​లోని ఆస్పత్రికి తరలించారు. అటు నుంచి పాలీ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. బాలిక బతికి ఉందా? లేదా తెలుసుకోవడానికి నిందితుడు ఆస్పత్రికి వచ్చి మరీ ఆరా తీశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు నిందితుని కోసం వెతికారు. కానీ అతడు తప్పించుకున్నాడు.

ఈ ఘటనకు గల కారణాలను చెప్పే పరిస్థితిలో బాలిక లేదని పోలీసులు వివరించారు. నిందితున్ని పట్టుకున్న తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:మహిళపైకి దూసుకెళ్లిన బస్సు.. టైర్​ కింద తల పడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.