ETV Bharat / bharat

రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్.. వారందరికీ సీఎం వరం - rajasthan cm lpg news

LPG price cut news : పేద ప్రజలకు భారీ వరం ప్రకటించింది రాజస్థాన్​ ప్రభుత్వం. వంట గ్యాస్​ సిలిండర్​ను రూ.500కే అందించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్​ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

rajasthan lpg price cut
రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్.. వారందరికీ సీఎం వరం
author img

By

Published : Dec 19, 2022, 5:49 PM IST

Updated : Dec 19, 2022, 6:19 PM IST

Rajasthan LPG price : పేదలకు శుభవార్త చెప్పింది రాజస్థాన్​లోని అశోక్​ గహ్లోత్ ప్రభుత్వం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి, ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్​ అందిస్తామని ప్రకటించింది. 2023 ఏప్రిల్​ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. అర్హులైన కుటుంబాలకు ఏటా 12 సిలిండర్లు ఇలా తక్కువ ధరకే అందిస్తామని సీఎం అశోక్ గహ్లోత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

"బడ్జెట్ కోసం కసరత్తులు ప్రారంభించాం. ఇప్పుడైతే నేను ఒకటే చెప్పగలను. పేద ప్రజలకు రూ.500కే సిలిండర్లు ఇస్తాం. ఉజ్వల పథకం కింద ప్రజలకు మోదీ సర్కారు ఎల్​పీజీ కనెక్షన్లు ఇచ్చింది. కానీ సిలిండర్ల ధర రూ.వెయ్యికి చేరింది. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం

వచ్చే ఏడాది రాజస్థాన్​లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేశారు సీఎం గహ్లోత్. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇతర విషయాలతో పోలిస్తే పార్టీలో వర్గపోరే ప్రధాన సమస్యగా మారింది.

Last Updated : Dec 19, 2022, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.