ETV Bharat / bharat

'అదానీ కోసం మావద్ద ప్రత్యేక పాలసీలు లేవు'.. పెట్టుబడుల వివాదంపై రాహుల్ - rajastan gautam adani

భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీ రాజస్థాన్​లో పెట్టుబడులు పెట్టడంపై స్పందించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానీపై రాజస్థాన్ సీఎం గహ్లోత్ ప్రశంసలు కురిపించడంపై మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రత్యేక పాలసీలు లేవని స్పష్టం చేశారు.

RAHUL GANDHI
RAHUL GANDHI
author img

By

Published : Oct 8, 2022, 6:13 PM IST

భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాము కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, ఏకస్వామ్యంగా వ్యవహరించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వ్యాపారవేత్తకో ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. కర్ణాటకలో భారత్​ జోడో యాత్ర నిర్వహిస్తున్న ఆయన.. తురువెకెరేలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజస్థాన్ ప్రభుత్వం అదానీకి తప్పుడు మార్గాల్లో వ్యాపారాన్ని కట్టబెడితే.. దాన్ని కూడా వ్యతిరేకిస్తానని తేల్చిచెప్పారు.

"రాజకీయాలు చేసి, కొంతమందికే ప్రాధాన్యం ఇస్తూ పనులు అప్పగించడాన్నే నేను వ్యతిరేకిస్తా. ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే రాజకీయంగా సహాయం పొంది.. ప్రతి వ్యాపారాన్ని గుత్తాధిపత్యాన్ని చేస్తున్నారు. ఇలా చేస్తే దేశం బలహీనపడుతుంది. దీన్ని నేను వ్యతిరేకిస్తా. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అన్ని వ్యాపారాలను కొంతమంది చేతిలో పెడుతోంది. రాజస్థాన్​లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ చెప్పారు. ఏ ముఖ్యమంత్రీ ఈ ఆఫర్​ను వదులుకోరు. వదులుకోవాలని అనుకోవడం కూడా తప్పు. రాజస్థాన్ ప్రభుత్వం వద్ద అదానీకి ప్రత్యేక పాలసీలు ఏమీ లేవు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

రాజస్థాన్​లో వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గహ్లోత్.. అదానీపై ప్రశంసలు కురిపించారు. అదానీని 'గౌతమ్ భాయ్' అని సంబోధించిన ఆయన... ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భాజపా నేతలు కాంగ్రెస్​పై విమర్శలకు దిగారు. 'ఎప్పుడూ అదానీ పేరు చెప్పి కేంద్రాన్ని విమర్శించే ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆయన్ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఆయన ప్రభుత్వం చివరిరోజుల్లో ఉంది' అంటూ రాజస్థాన్ భాజపా చీఫ్ వాసుదేవ్ దేవ్నానీ విమర్శలకు దిగారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం సైతం ఈ అంశంపై స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు అవసరమన్న ఆయన.. కేంద్ర హోంమంత్రి కుమారుడు జైషా రాజస్థాన్​కు వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. 'ఇదేం ప్రైవేటు కార్యక్రమం కాదు. పెట్టుబడుల సదస్సు. దీనికి 3వేల మంది హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఆటంకాలు సృష్టించాలని అనుకుంటారా? ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు. గౌతమ్ అదానీ గురించి వారు(భాజపా నేతలు) మాట్లాడుతున్నారు. గౌతమ్ అదానీ అయినా, ఇంకే అదానీ అయినా, ఆఖరికి అంబానీ, జైషా వచ్చినా మేం ఆహ్వానిస్తాం. మాకు ఉద్యోగాలు, పెట్టుబడులు కావాలి' అని గహ్లోత్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.