75వ స్వాతంత్య్ర ఉత్సవాలు దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంధన ధరలను గుర్తుచేస్తున్నాయని (ashok gehlot news) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. దీపావళికి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇస్తోందని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
"పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంట నూనె, కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే.. ద్రవ్యోల్బణాన్ని కేంద్రం దీపావళి కానుకగా ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇంతకుముందు ప్రభుత్వాలు పండగల ముందు ధరలను తగ్గించేవి. సామాన్యులు పండగలను సంతోషంగా జరుపుకునేవారు."
అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం
దీపావళికి మూడు రోజుల ముందు (congress fuel price) వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.266 పెంచిందని గుర్తు చేసిన గహ్లోత్... తద్వారా కేంద్రం స్వీట్స్ ధరలు పెరిగేలా చేసిందని విమర్శించారు. బాలికలు కళాశాలలకు వెళ్లడానికి తమ ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను పంపిణీ చేసిందని.. మోదీ ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలతో బాలికలు వాటిని ఎలా ఉపయోగించుకోగలరని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'మాజీ సీఎం భార్యతో డ్రగ్స్ వ్యాపారి ఫొటోలు'