ETV Bharat / bharat

రాజస్థాన్​ సీఎంకు అస్వస్థత- ఆసుపత్రిలో చేరిక

రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్(ashok gehlot news)​ ఛాతిలో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారని, ఆరోగ్యంగా ఉన్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు గహ్లోత్​.

Rajasthan CM Ashok Gehlot
రాజస్థాన్​ సీఎంకు అస్వస్థత
author img

By

Published : Aug 27, 2021, 12:31 PM IST

Updated : Aug 27, 2021, 1:03 PM IST

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​(ashok gehlot news) అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిగా ఉన్న క్రమంలో జైపుర్​లోని ఎస్​ఎంఎస్​ ఆసుపత్రిలో చేరినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

ఆసుపత్రిలో చేరిన తర్వాత.. ఆయనకు రక్తనాళాల పరీక్ష (యాంజియోప్లాస్టీ) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రత్యేక అధికారి లోకేశ్​ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

Rajasthan CM Ashok Gehlot
అశోక్​ గహ్లోత్ ట్వీట్​

" కొవిడ్​ నుంచి కోలుకున్నాక పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నిన్నటి నుంచి ఛాతిలో తీవ్రంగా నొప్పి వచ్చింది. ఇప్పుడే ఎస్​ఎంఎస్​ ఆసుపత్రిలో సీటీ ఎన్​జీఓ పరీక్షలు చేశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. త్వరలోనే తిరిగి వస్తా. మీ ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి. "

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

సీఎం అశోక్​ గహ్లోత్​ ఏప్రిల్​ 29న కరోనా బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు లేని క్రమంలో హోమ్​ ఐసోలేషన్​కు వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.

ఇదీ చూడండి: మా భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది: గహ్లోత్‌

Last Updated : Aug 27, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.