Rajastan woman kanyadan: అత్తా- కోడళ్లు అనగానే.. వారి మధ్య గొడవలు.. ఇంట్లో ఆధిపత్య పోరు.. ఇవే గుర్తొస్తాయి. ఇంటికి వచ్చే కోడలిని కూతురిలా చూసుకునే అత్తల గురించి చాలా అరుదుగా వింటుంటాం. అయితే, ఇప్పుడు మనం చదువుతున్న మహిళ మాత్రం.. అంతకుమించి! తన కొడుకు చనిపోతే.. కోడలిని పుట్టింటికి పంపించకుండా సొంత బిడ్డలా చూసుకుంది. చదివించి.. జీవితంలో నిలదొక్కుకునేలా చేసి రెండో వివాహం చేయించింది.
Second marriage to daughter in law
రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో నివసించే కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభం అనే ఓ కుమారుడు ఉండేవారు. 2016 మే 25న సునీత అనే అమ్మాయితో తన కుమారుడి వివాహం జరిపించింది కమల. పెళ్లి తర్వాత శుభం.. ఎంబీబీఎస్ చదివేందుకు కిర్గిస్థాన్‌కు వెళ్లారు. 2016 నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు.
అయితే, కుమారుడి మృతి తర్వాత కోడలిని దూరం చేసుకోలేదు కమలా దేవి. తన ఇంట్లోనే ఉంచుకొని.. జీవితంలో నిలదొక్కుకునేలా వెన్నంటి ప్రోత్సాహం అందించింది. అత్త సహకారంతో చదువు కొనసాగించిన సునీత.. గ్రేడ్-1 లెక్చరర్ ఉద్యోగం సంపాదించింది. జీవితంలో తనకాళ్లపై తాను నిలబడేలా ఎదిగింది. దీంతో సునీతకు దగ్గరుండి రెండో వివాహం చేయించారు కమలా దేవి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్‌లో 5.3 కోట్ల హెరాయిన్