ETV Bharat / bharat

ఆ ఆలయంలో ప్రసాదంగా సమోసాలు! - ఛత్తీస్​గఢ్​ ధూమావతి ఆలయం

ఆలయాల్లో స్పైసీ ఫుడ్​ ఐటమ్స్ ప్రసాదంగా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా ఉండవు. సహజంగా.. తీపి పదార్థాలు, పులిహోర, పండ్లు వంటివి దేవుడికి సమర్పిస్తుంటారు. కానీ, ఓ ఆలయంలో సమోసా, కచోరీ, మిర్చి భజ్జీ మొదలైనవి ప్రసాదంగా ఇస్తున్నారు. అసలీ ఆలయం ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలేమిటి?.

spicy food
సమోసాలు, స్పైసీ ఫుడ్
author img

By

Published : Jun 19, 2021, 8:49 PM IST

ధూమావతి అమ్మవారి ఆలయం

సాధారణంగా ఆలయాల్లో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలు ప్రసాదంగా ఇస్తుంటారు. కానీ, ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​కు చెందిన ఓ ఆలయంలో స్పైసీ పదార్థాలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే..

దేశంలోనే మొదటి ఆలయం..

దుర్గామాత అవతారమైన ధూమావతి అమ్మవారి ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది రాయ్​పుర్​ పాతబస్తీ ప్రాంతంలోని శీత్లా మందిర్ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని నీరజ్​ సాయిని అనే పూజారి పదేళ్ల క్రితమే నిర్మించారు.

samosa
అమ్మవారికి సమోసాలు, మిర్చి భజ్జీలు

అయితే.. ధూమావతి అమ్మవారికి.. సమోసాలు, కచోరీ, మిర్చి భజ్జీ, ఆలూబొండా వంటి స్పైసీ పిండివంటకాలు ప్రసాదంలా సమర్పిస్తుంటారు అక్కడి ప్రజలు. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించడం మరెక్కడా లేదని, దేశంలో పీఠం ఏర్పాటు చేసిన మొదటి ధూమావతి అమ్మవారి ఆలయమిదే అని పూజారి నీరజ్​ చెబుతున్నారు. అమ్మవారికి స్పైసీ ఫుడ్​ అంటేనే ఇష్టం అని ప్రజలు నమ్ముతారని అన్నారు.

prasad samosa
ప్రసాదంగా స్పైసీ ఐటమ్స్

జ్యోతి బిందు రూపంలో అమ్మవారిని ఆరాధిస్తామని నీరజ్​ చెప్పారు. విగ్రహానికి ఓ ప్రత్యేక రూపం అంటూ లేదని పేర్కొన్నారు.

dhumavathi maa
ధూమావతి అమ్మవారికి పూజలు

శుక్రవారం జ్యేష్ఠ శుక్ల అష్టమి సందర్భంగా.. అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. పండ్లు, స్వీట్లతో పాటు సమోసాలు ప్రసాదంగా ఉంచారు. అయితే.. కరోనా కారణంగా ఈ ఏడాది అతి తక్కువ మంది సమక్షంలో పూజలు నిర్వహించినట్లు పూజారి నీరజ్ సాయిని వెల్లడించారు.

ఇదీ చదవండి:'కరోనా మాత' ఆలయం కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.