అకాల వర్షాలకు ఉత్తరభారతం తడిసిముద్దయ్యింది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. గాజిపుర్ పండ్ల మార్కెట్లో నీరు నిలిచిపోయింది. పండ్లు, కూరగాయలు తడిసిపోయాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా బద్రినాథ్ యాత్రను నిలిపివేశారు.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఛండీగఢ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదశ్, బంగాల్లో మరో 24గంటల వరకు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది(north india rain forecast).
ఇదీ చూడండి:- వరుణుడి ప్రకోపం.. కన్నీటి సంద్రమైన కేరళ