ETV Bharat / bharat

'ఆగస్ట్, సెప్టెంబర్​లో జోరుగా వర్షాలు!'

ఆగస్టు-సెప్టెంబర్​ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆగస్టు నెలలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

Rainfall during August and September
వర్షపాతం
author img

By

Published : Aug 2, 2021, 2:41 PM IST

Updated : Aug 2, 2021, 2:57 PM IST

వర్షాకాలం రెండో అర్ధభాగంలో వానలు భారీగానే కురవనున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

ద్వీపకల్ప భూభాగం, మధ్య భారతంలో వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని ఐఎండీ లెక్కగట్టింది. తూర్పు, ఉత్తర, ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం లేదా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని వివరించింది.

ఈ ఏడాది నుంచి నెలవారీ అంచనాలను సైతం వెలువరిస్తున్న ఐఎండీ.. ఆగస్టులో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెలలో సగటున 94-106 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇప్పుడు ఎల్​ నినో.. తర్వాత లా నినో!

పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను బట్టి.. సాధారణ ఎల్​నినో పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర పేర్కొన్నారు. వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షాల సీజన్ పూర్తైన తర్వాత లా నినో ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు.

ఇదీ చూడండి: తొలగిన ఆంక్షలు.. విద్యార్థుల బడిబాట

Last Updated : Aug 2, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.