ETV Bharat / bharat

ఊపిరి పీల్చుకున్న దిల్లీ- పలుచోట్ల వర్షం, మెరుగైన గాలి నాణ్యత- 400 దిగువకు AQI - ఢిల్లీలో వర్షం కాలుష్యం

Rain In Delhi Improves AQI : దిల్లీలో అర్ధరాత్రి కురిసిన వర్షంతో వాయు నాణ్యత కాస్త మెరుగుపడింది. శుక్రవారం ఉదయం వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 376కు మెరుగుపడింది. మరోవైపు, నగరంలోకి అనుమతుల్లేని ట్రక్కులు సైతం వస్తున్నాయంటూ దిల్లీ మంత్రులు సరిహద్దులో తనిఖీలు చేపట్టారు.

Rain In Delhi Improves AQI
Rain In Delhi Improves AQI
author img

By PTI

Published : Nov 10, 2023, 9:44 AM IST

Updated : Nov 10, 2023, 10:27 AM IST

Rain In Delhi Improves AQI : వారం రోజులకు పైగా తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడిన దిల్లీవాసులకు కాస్త ఊరట లభించింది. గురువారం అర్ధరాత్రి తర్వాతి నుంచి నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో వాతావరణం మెరుగైంది. దిల్లీ- నోయిడా ప్రాంతంతో పాటు కర్తవ్యపథ్, ఐటీఓ, ద్వారకా సెక్టార్-3 సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఫలితంగా గత కొద్దిరోజులతో పోలిస్తే గాలి నాణ్యత మెరుగుపడింది. గురువారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 460 ఉండగా, శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 408కి, 9 గంటల సమయానికి 376కు మెరుగైంది. కృత్రిమ వర్షం కురిపించేందుకు దిల్లీ సర్కారు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వాన పడటం విశేషం.

దీపావళికి ముందు వాతావరణం మెరుగుపడుతుందని భారత వాతావరణ శాఖ ఇదివరకే అంచనా వేసింది. స్వల్పంగా వర్షం కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. వాయు నాణ్యత సైతం మెరుగవుతుందని చెప్పింది. గాలి దిశ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పంట వ్యర్థాల పొగ ద్వారా దిల్లీలో ఏర్పడే కాలుష్యం తగ్గుతుందని అంచనా వేసింది.

వాహనాలపై నిషేధం.. అయినా..
మరోవైపు, దిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. వాహనాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- స్టేజీ-4ను కేంద్రం అమలు చేస్తోంది. దీని ప్రకారం.. బీఎస్-3 పెట్రోల్ వాహనాలు, బీఎస్-4 డీజిల్ వాహనాలు దిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఏక్యూఐ 400 దాటితే ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ప్రస్తుతం దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 400కు పైనే కొనసాగుతోంది.

  • Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB).

    AQI in Ashok Vihar at 462, in RK Puram at 461, in Punjabi Bagh at 460 and in ITO at 464 pic.twitter.com/4QyeawexL5

    — ANI (@ANI) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంత్రుల చెకింగ్..
కాగా, నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో తనిఖీ చేసేందుకు దిల్లీ మంత్రులు రంగంలోకి దిగారు. గురువారం అర్ధరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి దిల్లీలోకి వస్తున్న వాహనాలను పరిశీలించారు. అత్యవసరం కాని వస్తువులతో వచ్చే ట్రక్కులకు దిల్లీలోకి అనుమతి లేదని మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అయితే, అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్ని ట్రక్కులు దిల్లీలోకి వస్తున్నాయని అన్నారు. ఫలితంగా నగరంలో కాలుష్యం తీవ్రమవుతోందని ఆరోపించారు. కాగా, గాజీపుర్​ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

  • VIDEO | "GRAP-4 is implemented in Delhi which means entry of trucks with non-essential items is not allowed. But, all the trucks are entering the city without any checking due to the negligence of the officers and air pollution is worsening," says Delhi minister @Saurabh_MLAgkpic.twitter.com/3YZD1c0Fwd

    — Press Trust of India (@PTI_News) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Air Pollution Today : దిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

మహువాకు ఎదురుదెబ్బ- లోక్​సభ నుంచి బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు- గెలిచి మళ్లీ వస్తానని ఎంపీ ధీమా

Last Updated : Nov 10, 2023, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.