Railway General Ticket Rules : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే రవాణా మాధ్యమం రైల్వే వ్యవస్థ. జనరల్ కోచ్, ఏసీ, స్లీపర్, ప్యాసింజర్ ఇలా అనేక రైళ్లు.. ఎంతో మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇక మనదేశ రైల్వే గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో రైళ్లకు ఎల్లప్పుడూ డిమాండే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్ బోగీలు కిటకిటలాడుతూనే కనిపిస్తాయి. దేశ రవాణా కనెక్టివిటీలో అత్యధిక భాగం రైల్వేదే. 2020లో అయితే రికార్డు స్థాయిలో 808.6 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
Change Train With General Ticket : జనరల్ టికెట్ మినహా మిగతా అన్నింటినీ ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాలంటే ఎలాంటి ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదు. నేరుగా స్టేషన్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కితే సరిపోతుంది. ఈ క్రమంలోనే చాలామంది ప్రయాణికులు ఒక రైలు జనరల్ టికెట్‌తో మరో ట్రైన్ ఎక్కేస్తుంటారు. అయితే, ఈ విషయంపై రైల్వే శాఖ స్పష్టమైన నిబంధనలను ఉన్నాయి. ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది జనరల్ టికెట్ కొనుక్కొని మరో ట్రైన్లో ఎక్కేస్తుంటారు. ఇలా చేస్తే ఏం అవుతుందో ఇప్పుడు తెలసుకుందాం.
Railway General Ticket Validity : ఎక్స్‌ప్రెస్ లేదా ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలోని జనరల్ టికెట్‌తో మరో ట్రైన్లో ఎక్కడానికి అనుమతి లేదు. కేవలం మీరు కొనుక్కున రైలులో మాత్రమే ప్రయాణించాలని రైల్వే శాఖ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఒకవేళ అలా కాకుండా జనరల్ టికెట్‌తో రైళ్లు మారితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల జనరల్ టికెట్‌తో వేరే రైళ్లు ఎక్కకపోవడం మంచిది. అదే లోకల్ ట్రైన్లలో అయితే కొంత వెసులుబాటు ఉంటుంది. మీరు కొనుక్కున్న స్టేషన్ పేరుతో పాటు సమయం కూడా టికెట్‌పై ముద్రించి ఉంటుంది. దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లో అయితే ఒక గంట వరకు జనరల్ టికెట్‌తో మరో ట్రైన్లో ఎక్కొచ్చు. ఈ సమయంలోగా ప్రయాణికుడు మరో ట్రైన్లో తన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అదే మిగిలిన స్టేషన్లలో అయితే 3 గంటల సమయం పాటు వెసులుబాటు ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికుడు జనరల్ టికెట్‌తో మరో ట్రైన్లో ప్రయాణించవచ్చు.
How to Check Train PNR Status : మీకు తెలుసా..? ట్రైన్ PNR స్టేటస్ సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు!