ETV Bharat / bharat

'కేంద్రం వైఫల్యమే కరోనా సంక్షోభానికి కారణం'

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి జాతీయస్థాయి లాక్​డౌన్ విధించే పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అత్యంత పేదరికంలో ఉన్నవారికి ఆర్థిక, ఆహార సహాయాన్ని అందించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

Rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 7, 2021, 12:38 PM IST

లాకౌడౌన్ విధింపుతో ఆర్థికవ్యవస్థపై కలిగే ప్రతికూల ప్రభావం గురించి ప్రభుత్వం ఆందోళన చెందవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రాహుల్​ గాంధీ సూచించారు. వైరస్ వ్యాప్తితో పౌరులు విషాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

"ప్రభుత్వానికి కరోనా టీకా విషయంలో స్పష్టమైన వ్యూహం లేకపోవడం, వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ మహమ్మారిపై విజయం సాధించినట్లు ప్రకటించడంమే దేశాన్ని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంచాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో వినాశకరమైన జాతీయ లాక్​డౌన్ దాదాపు అనివార్యమైంది."

-రాహుల్ గాంధీ

లాక్​డౌన్​ విధింపునకు ప్రజలను సిద్ధం చేయడం క్లిష్టమైనదేనని అభిప్రాయపడ్డారు రాహుల్. అయితే సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదల ఖాతాల్లో రూ.6000 జమచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

"గత సంవత్సరం విధించిన లాక్​డౌన్ వల్ల సంభవించిన పేదల బాధలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం కరుణతో వ్యవహరించాలి. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సహాయంతో పాటు ఆహారన్ని అందించాలి."

-రాహుల్ గాంధీ

ప్రభుత్వ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించి పటిష్ఠమైన వ్యూహంతో పేదలకు ఆర్థిక, ఆహార సాయాన్ని చేయాలని కోరారు. దేశప్రజలందరికీ వేగంగా టీకాలు అందించాలన్న రాహుల్.. కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండి.. పరిశోధనల వివరాలను ప్రపంచానికి తెలియజేయాలన్నారు.

ఇవీ చదవండి: లాక్​డౌన్​తోనే వైరస్​ వ్యాప్తిని అరికట్టగలం: రాహుల్

'ప్రధాని వైఫల్యంతోనే దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులు'

విదేశాల సాయం వివరాలెక్కడ?: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.