కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న 'సత్యాగ్రహ దీక్ష'కు మద్దతివ్వాలని దేశ ప్రజలను ట్విట్టర్ ద్వారా కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా 'కిసాన్ అధికార్ దివస్' పేరిట అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోందన్నారు.
"రైతులు.. తమ హక్కులను పొందేందుకు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులపై జరుగుతున్న అన్యాయానికి, పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశం మొత్తం కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి."
---ట్విట్టర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ రైతు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోంది. రైతు సంఘాలకు, కేంద్రానికి ఇవాళ తొమ్మిదో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 'కిసాన్ అధికార్ దివస్' పేరిట నిరసనలు చేపట్టింది.
ఇదీ చదవండి : దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు