ETV Bharat / bharat

'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్ - రాహుల్ గాంధీ టీషర్ట్​

Rahul Gandhi T shirt : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. రాహుల్​ అత్యంత ఖరీదైన టీషర్ట్ వేసుకున్నారని, విలాసవంతమైన కంటైనర్లలో బస చేస్తున్నారని భాజపా విమర్శలు గుప్పించగా.. కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను కమలదళం ఓర్వలేకపోతోందని మండిపడింది.

Rahul Gandhi T shirt
Rahul Gandhi T shirt
author img

By

Published : Sep 9, 2022, 5:48 PM IST

Updated : Sep 9, 2022, 6:08 PM IST

Rahul Gandhi T shirt : భారత్​ జోడో పేరిట కాంగ్రెస్​ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ధరించిన ఓ టీషర్ట్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ టీషర్ట్​ ధర ఏకంగా రూ.41,257 అంటూ కాంగ్రెస్​పై భాజపా విమర్శలు గుప్పించింది. రాహుల్​ ఫొటో, పక్కనే ద బర్​బరీ టీషర్ట్​ ధరతో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. 'భారత్​, దేఖో(భారత్​, చూడు)' అనే క్యాప్షన్​తో ఈ ఫొటోలు షేర్ చేసి, కాంగ్రెస్​ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసింది.

భాజపా ట్వీట్​పై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో స్పందించింది. "భారత్​ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి భయం వేసిందా? అసలు విషయాలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడు. దుస్తుల గురించే మాట్లాడదాం అంటే.. మోదీ వేసుకున్న రూ.10లక్షల సూట్, పెట్టుకున్న రూ.1.5లక్షల కళ్లద్దాల గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది" అని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్.

అంతకుముందు.. భారత్​ జోడో యాత్రలోని పాదయాత్రికులు బస చేస్తున్న కంటైనర్ల విషయంలోనూ భాజపా, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. అత్యంత విలాసవంతమైన కంటైనర్లలో ఉంటూ పాదయాత్ర చేయడం ఏంటని భాజపా నేతలు కొందరు ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఆయా కంటైనర్లలో కనీస సదుపాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: '2-3 నెలల్లో నాకు మరింత జ్ఞానం వస్తుంది'

'రాహుల్​ యాత్రతో బాహుబలిలా కాంగ్రెస్​.. ఎవరైనా తక్కువ అంచనా వేస్తే..'

Last Updated : Sep 9, 2022, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.