ETV Bharat / bharat

'సంపన్నుల కోసమే మోదీ పనిచేస్తున్నారు' - మోదీపై రాహుల్

భాజపా విద్వేషాలను రెచ్చగొడితే, కాంగ్రెస్ వాటిని నశింపజేస్తుందని అన్నారు అగ్రనేత రాహుల్ గాంధీ. అసోం సంస్కృతి, సౌభ్రాతృత్వంపై భాజపా దాడి చేస్తోందని ఆరోపించారు. ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు.

Rahul Gandhi to interact with IOC Refinery employees in Assam today
'భాజపా.. ఒక్కో చోట ఒక్కోలా హామీ'
author img

By

Published : Mar 20, 2021, 3:35 PM IST

సాగు చట్టాలను చర్చ లేకుండానే ఆమోదించారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. విపక్షాలను పార్లమెంట్​లో ప్రభుత్వం మాట్లాడనివ్వదని అసోం ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు. అయినా ప్రజల కోసం బలంగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పారు.

"అసోం సంస్కృతి, భాష, చరిత్ర, సహృద్భావంపై భాజపా దాడిచేస్తోంది. మేము విద్వేషాన్ని తొలగించి, శాంతిని స్థాపిస్తాం. దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తారు. భాజపా ఒక్కో చోట ఒక్కోలా హమీలిస్తుంది. కానీ వాటిని నిలబెట్టుకోదు. నేను అబద్ధం చెప్పను. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు, అవి ఎలా నేరవేర్చామో చూడండి. ఇది మీ రాష్ట్రం. దీనిని నాగ్​పుర్​ (ఆర్​ఎస్​ఎస్​ను ఉద్దేశించి) నుంచి నడిపించరాదు."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Rahul Gandhi to interact with IOC Refinery employees in Assam today
ఐఓసీ ఉద్యోగుల సమావేశంలో రాహుల్

అనంతరం దిగ్బోయ్​లోని ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్(ఐఓసీ) ఉద్యోగులతో సమావేశమయ్యారు రాహుల్. రెండు రోజుల పర్యటన కోసం అసోంలో ఉన్న రాహుల్.. పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4.45 గంటలకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి: 'ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీదీ బుజ్జగింపుల ఆట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.