వైద్య సిబ్బందికి ఆరోగ్య బీమా అందించటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా యోధుల పట్ల మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావం లేదని మండిపడ్డారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంటే ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి బీమా సౌకర్యం కల్పించలేదంటూ వచ్చిన రిపోర్టుపై ఆయన స్పందించారు.
కరోనా యోధుల(వైద్యసిబ్బంది) కోసం గతేడాది కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ బీమా పథకం గడువు ఈ నెల 24తో ముగియనుంది. అయితే దీని తర్వాత వారి కోసం కొత్త బీమా పాలసీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి : కరోనా యోధులకు కొత్త బీమా పాలసీ!