ETV Bharat / bharat

'పరిహారం చిన్నసాయం.. అది కూడా ఇవ్వలేరా?' - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కరోనాతో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేమన్న కేంద్రం వాదనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పరిహారం ఇవ్వటం చిన్నసాయమని, మోదీ ప్రభుత్వం అది కూడా చేయటానికి సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Jun 21, 2021, 1:35 PM IST

కొవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వటంలో కేంద్రం విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు తెలియజేయటాన్ని తప్పుపట్టారు. ప్రాణానికి విలువ కట్టడం అసంభవమని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటం ఓ చిన్న సాయమన్నారు. మోదీ ప్రభుత్వం అది కూడా చేయటానికి సిద్ధంగా లేదని రాహుల్‌ ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు.

rahul gandhi tweet
రాహుల్ గాంధీ ట్వీట్

"మహమ్మారి వ్యాప్తి సమయంలో తొలుత సరైన చికిత్స అందించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత తప్పుడు లెక్కలు చూపించింది."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

స్తోమత లేదు..

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున సాయం అందించలేమంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కరోనా మృతులకు పరిహారం చెల్లించటం ఆర్థికపరమైన అంశమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత స్తోమత లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.

ఇదీ చదవండి: 'ఎన్నికల వల్లే ఈ స్థాయికి ఎదిగారా?'

గతుకుల బాటలో కాంగ్రెస్‌.. పూర్వవైభవం దక్కేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.