ETV Bharat / bharat

'పరువునష్టం కేసు నుంచి విముక్తి కల్పించండి' - కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ

ఏడీసీ బ్యాంక్​ ఛైర్మన్​ అజయ్​ పటేల్​ వేసిన పరువునష్టం కేసు నుంచి విముక్తి కల్పించాలని.. అహ్మదాబాద్​ కోర్టుకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాందీ. అహ్మదాబాద్​ జిల్లా సహకార బ్యాంకు.. నోట్ల రద్దు సమయంలో కుంభకోణానికి పాల్పడిందని గతంలో ఆరోపించారు రాహుల్​.

author img

By

Published : Feb 4, 2021, 5:44 AM IST

Updated : Feb 4, 2021, 5:57 AM IST

తనపై దాఖలైన పరువునష్టం కేసు నుంచి విముక్తి కల్పించాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అహ్మదాబాద్​ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు దారుడు అందుబాటులో లేని కారణంగా కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ డిశ్చార్జి పిటిషన్​ సమర్పించారు.

ఇదీ జరిగింది..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా గతంలో.. అహ్మదాబాద్​ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీ)పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 నవంబర్ 8న నోట్లరద్దు ప్రకటించిన ఐదు రోజుల్లో.. రూ.745.59 కోట్ల విలువైన చెల్లుబాటు అయ్యే నోట్లను మార్పిడి చేసి ఈ బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

ముంబయికి చెందిన ఓ కార్యకర్త ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్​ రూరల్ డెవలప్​మెంట్ ఇచ్చిన సమాధానం ఆధారంగానే రాహుల్ గాంధీ, సుర్జేవాలా.. ఏడీసీ బ్యాంకుపై ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఏడీసీ బ్యాంకుతో పాటు ఛైర్మన్ అజయ్​ పటేల్ వ్యక్తిగతంగా​.. ఈ ఇరువురు నేతలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఈ ఏడీసీ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం 2019 ఏప్రిల్ 9న రాహుల్​గాంధీ, రణ్​దీప్​​ సుర్జేవాలాలకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: మరుగుదొడ్డిలో చిరుత, శునకం.. వీడియో వైరల్​!

Last Updated : Feb 4, 2021, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.