దేశంలోని పేదలు, దళితులు, రైతులు, కార్మికుల గళం సృష్టించే తుపానుతో ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి దూరంకాక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ విభాగం జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన 'హల్లా బోల్' ఆందోళనలో రాహుల్ పాల్గొన్నారు. 'దేశంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా' ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్.. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏ శక్తికీ భయపడాల్సిన అవసరం లేదని ఉద్బోధించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకున్నారని.. వాటిని సవాలు చేయాల్సిందేనని అన్నారు.
"దేశంలో పేదలు, దళితులు, రైతులు, కార్మికుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఇది క్రమంగా బలపడుతోంది. ప్రధాని మోదీని తన నివాసం నుంచి బయటకు నెట్టే తుపానుగా మారుతుంది. బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ చెప్పిన అంశాలను దేశ ప్రజలకు గుర్తు చేయడం మన విధి. ఏ శక్తికీ భయపడొద్దు. వ్యతిరేక శక్తులపై పోరాటం ప్రారంభించిన రోజు.. దేశ వ్యతిరేకులంతా పారిపోతారు."
-రాహుల్ గాంధీ
ఇవీ చదవండి: