భారత మాజీ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 57వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్(congress) అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) దిల్లీలోని శాంతివన్లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం.. నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్(twitter) వేదికగా స్మరించుకున్నారు.
"'విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది.' అని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం."
-రాహుల్ గాంధీ(rahul gandhi), కాంగ్రెస్ అగ్రనేత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా నెహ్రూకు నివాళులు అర్పించారు. "భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు." అని హిందీలో ట్వీట్ చేశారు.
1889 నవంబర్ 14న నెహ్రూ జన్మించారు. 1919 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(congress)లో చేరిన ఆయన.. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1923లో ఐఎన్‌సీ(కాంగ్రెస్) ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం.. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
ఇదీ చూడండి: 'కొవిడ్‌ను నియంత్రించాలంటే టీకా పంపిణీ పెరగాలి'
ఇదీ చూడండి: vaccination: 20 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ