ETV Bharat / bharat

చిక్కుల్లో రాహుల్ గాంధీ- 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం - రాహుల్ గాంధీ ఈసీ నోటీసులు దిల్లీ హైకోర్టు

Rahul Gandhi on PM Modi Pickpocket Case : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎనిమిది వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

rahul-gandhi-on-pm-modi-pickpocket-case
rahul-gandhi-on-pm-modi-pickpocket-case
author img

By PTI

Published : Dec 21, 2023, 6:39 PM IST

Rahul Gandhi on PM Modi Pickpocket Case : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసులపై ఎనిమిది వారాల్లో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు- ఎనిమిది వారాల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

నవంబర్ 22న ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ భరత్ నగర్ కోరారు. మోదీని కించపరచడం సహా అత్తున్నత హోదాలో ఉన్న వ్యక్తులపై సంచలన ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నవంబర్ 23నే ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

అయితే, రాహుల్ నుంచి ఇంత వరకు వివరణ రాలేదని ఈ కేసుపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ బెంచ్ పేర్కొంది. 'ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. రాహుల్ గాంధీకి నోటీసులు కూడా జారీ చేసింది. నోటీసులకు సమాధానం చెప్పేందుకు డెడ్​లైన్ ముగిసింది. ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాలేదు. కాబట్టి ఈ విషయంపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశిస్తున్నాం' అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ ఫిర్యాదు- ఈసీ నోటీసు
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో నవంబర్ 22న రాజస్థాన్​లో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రధానిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. మోదీని పనౌతీ (అశుభం)గా అభివర్ణించారు. ప్రపంచకప్​ ఫైనల్​లో భారత్ ఓటమికి మోదీ కారణమంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును అదానీ కాజేస్తుంటే మోదీ వారి దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జేబు దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

'గాంధీ, నెహ్రూల రాజకీయ చతురత రాహుల్​కు అబ్బలేదు- ఆ మాత్రం తెలియకుంటే PMO ఎలా నడుపుతారు!?'

'మోదీ వల్లే టీమ్​ఇండియా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది'- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.