కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన ఉపన్యాసానికి ముందు కొత్త లుక్‌లో కనిపించారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లండన్ వెళ్లిన ఆయన ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. 52 ఏళ్ల రాహుల్ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను కొందరు అభిమానులు పలు హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గతేడాది భారత్ జోడో యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలను చుట్టిన రాహుల్ తన జుట్టు, గడ్డం పెంచారు. అనేక నెలల తర్వాత ఇప్పుడు జుట్టు, గడ్డాన్ని కత్తిరించుకుని కొత్త లుక్‌లో కనిపించారు. పాదయాత్ర తర్వాత హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేయించి, ఇలా స్టైలిష్‌గా కనిపించడం ఇదే తొలిసారి. లండన్‌లో రాహుల్ పర్యటన వారం పాటు సాగనుంది. ఇందుకోసం ఆయన మంగళవారం ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. లండన్‌కు వెళ్లేముందు గత నెల 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
-
Rahul Gandhi ji trims off his beard, finally. @RahulGandhi #RahulGandhi pic.twitter.com/YsHkjoeGiN
— Sundar IYC (@sundar_iyc) March 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul Gandhi ji trims off his beard, finally. @RahulGandhi #RahulGandhi pic.twitter.com/YsHkjoeGiN
— Sundar IYC (@sundar_iyc) March 1, 2023Rahul Gandhi ji trims off his beard, finally. @RahulGandhi #RahulGandhi pic.twitter.com/YsHkjoeGiN
— Sundar IYC (@sundar_iyc) March 1, 2023
జడ్జి బిజినెస్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి "లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st సెంచరీ" అనే అంశంపై స్పీచ్ ఇవ్వనున్నారు రాహుల్. కాగా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో M.Phil. చదివిన రాహుల్ గాంధీ 1995లో డాక్టరేట్ పట్టా పొందారు.
కేంబ్రిడ్జ్‌లో రాహుల్ "బిగ్ డేటా అండ్ డెమొక్రసీ"తో పాటు భారత్-చైనా సంబంధాలు అనే అంశాలపై పలువురు ప్రముఖ ప్రొఫెసర్లతో చర్చించనున్నారు. తమ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి భారత విపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీని అతిథిగా ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్ చేసింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.
ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. "నేను చదివిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఉపన్యాసం ఇవ్వడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, బిగ్ డేటా అండ్ డెమ`క్రసీ సహా వివిధ అంశాలపై ప్రతిభావంతులైన విద్యార్థులతో మమేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని రాహుల్ రిప్లై ఇచ్చారు.
గతేడాది మే నెలలో ఇంగ్లాడ్ పర్యటన సందర్భంగా 'ఇండియా ఎట్ 75' కార్యక్రమం నిర్వహించిన కార్పస్ క్రిస్టీ కాలేజ్‌లో ప్రసంగించారు రాహుల్.