సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపడుతున్న క్రమంలో మరోమారు కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లను సూచిస్తూ ధ్వజమెత్తారు. రైతులు చేస్తోన్న ఆందోళనలకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
-
बिहार का किसान MSP-APMC के बिना बेहद मुसीबत में है और अब PM ने पूरे देश को इसी कुएँ में धकेल दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ऐसे में देश के अन्नदाता का साथ देना हमारा कर्तव्य है। pic.twitter.com/Err20Pp0kv
">बिहार का किसान MSP-APMC के बिना बेहद मुसीबत में है और अब PM ने पूरे देश को इसी कुएँ में धकेल दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2020
ऐसे में देश के अन्नदाता का साथ देना हमारा कर्तव्य है। pic.twitter.com/Err20Pp0kvबिहार का किसान MSP-APMC के बिना बेहद मुसीबत में है और अब PM ने पूरे देश को इसी कुएँ में धकेल दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2020
ऐसे में देश के अन्नदाता का साथ देना हमारा कर्तव्य है। pic.twitter.com/Err20Pp0kv
" ఎంఎస్పీ-ఏపీఎంసీ లేకపోవటం వల్ల బిహార్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ అదే సమస్యల అగాధంలోకి యావత్ దేశాన్ని నెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు రైతులకు మద్దతుగా నిలవాలి. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
కేంద్రం తీసుకొచ్చిన 3వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్నారు రైతులు. శనివారం ఐదో విడత చర్చలు జరపనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించి, కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కిసాన్ మహాపంచాయత్ అధ్యక్షుడు రామ్‌పాల్ జట్. శనివారం జరిగే చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకుంటే రాజస్థాన్‌కు చెందిన రైతులు ఎన్‌హెచ్-8 నుంచి దిల్లీకి ర్యాలీగా వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్ ముట్టడే: రైతులు