ETV Bharat / bharat

రాహుల్​ దేశ వినాశకారిగా మారుతున్నారు: నిర్మల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ దేశానికి వినాశకారిగా మారతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ద్వంద్వ వైఖరి స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

rahul gandhi, nirmala, budget, doomsday
'రాహుల్​ గాంధీ దేశ వినాశకారిగా మారుతున్నారు'
author img

By

Published : Feb 13, 2021, 3:52 PM IST

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో శనివారం ధ్వజమెత్తారు. రాజ్యాంగ విధివిధానాలను అవమానిస్తూ, అవాస్తవ ఆరోపణలు చేస్తూ దేశ వినాశకారిగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అనవసర ఆరోపణలు చేసే రాహుల్​కు బడ్జెట్​​పై కేంద్ర వివరణ వినే సహనం కూడా లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్​పై రాహుల్​ గాంధీ గురువారం చేసిన వ్యాఖ్యలకు బదులుగా నిర్మల ఈ విధంగా స్పందించారు.

"కాంగ్రెస్​ ద్వంద్వ వైఖరిని మనం గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే పార్లమెంట్​ వ్యవస్థపైన వారికి పూర్తిగా నమ్మకం పోయిందన్న విషయం స్పష్టం అవుతోంది. సాగు చట్టాలను ప్రతిపాదించిన కాంగ్రెసే ఇప్పుడు ఎందుకు యూటర్న్​ తీసుకుందో అన్న విషయం నాకు తెలుకోవాలని ఉంది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

పంజాబ్​ సంగతేంటి..?

వ్యవసాయ చట్టాలపైన మాట్లాడిన రాహుల్​.. పంజాబ్​లో రైతుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదని నిర్మల ప్రశ్నించారు. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ తన హయాంలో రుణమాఫీలు ఎందుకు చేయలేదో రాహుల్​ వివరించాలన్నారు. గురువారం చేసిన ప్రసంగంలో సాగు చట్టాలలోని ఒక్క క్లాజ్​ గురించి కూడా ప్రసావించలేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలో సంస్కరణలను సమర్థించిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె పేర్కొన్నారు. ​

ఇదీ చదవండి : 'రేడియో.. బంధాలను బలోపేతం చేసే అద్భుత సాధనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.