ETV Bharat / bharat

'మోదీ ఘనత.. కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం' - Rahul Gandhi attacks PM on GDP

దేశ జీడీపీ కనిష్ఠ స్థాయికి వెళ్తోందని, నిరుద్యోగం తీవ్రంగా మారుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.

Rahul Gandhi attacks PM on GDP, unemployment
'మోదీ ఘనత.. కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం'
author img

By

Published : Jun 1, 2021, 4:54 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. జీడీపీ ప్రతికూల పథంలో పయనిస్తోందని, నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరిందని పేర్కొన్నారు. 'ప్రధాని హాల్ ఆఫ్ షేమ్- కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం' అంటూ నిరుద్యోగానికి సంబంధించిన గ్రాఫ్​ను ట్వీట్ చేశారు రాహుల్.

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.3 శాతంగా నమోదైన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 1.6 శాతం వృద్ధి సాధించింది.

అంతకుముందు బ్లాక్ ఫంగస్​ వ్యాధిపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు రాహుల్. ఔషధాల కొరతపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని నిలదీశారు. ఈ ఔషధాన్ని పొందాల్సిన పద్ధతులు ఏంటని అడిగారు. బ్లాక్​ ఫంగస్​ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తున్నారని నిలదీశారు.

ఇదీ చదవండి- నదిలో మృతదేహాలు- పీక్కు తింటున్న కుక్కలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.