సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నివాళి అర్పించకపోవడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నిరసనల్లో 300 మంది అన్నదాతలు చనిపోయారని తెలిపిన రాహుల్.. వారిని స్మరించుకుంటూ నిరసనల్లో 300 మరణాలు అంటూ హాష్ ట్యాగ్‌ను జత చేశారు.
రైతుల మృతికి నివాళిగా తాను పాటించే రెండు నిమిషాల మౌనం భాజపా నేతలకు ఆమోదయోగ్యం కాదని రాహుల్ విమర్శించారు. అయినా ప్రాణత్యాగం చేసిన అన్నదాతలు, కార్మికులకు తాను మళ్లీ మళ్లీ నివాళులర్పిస్తానని స్పష్టం చేశారు.
నిరుద్యోగంపైనా..
దేశంలో నిరుద్యోగంపైనా కేంద్రాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత. దేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని విమర్శించారు. చాలా ఈపీఎఫ్ ఖాతాలు మూతపడుతున్నాయని, ఇటీవల వెల్లడైన ఓ నివేదికను జత చేశారు రాహుల్.
ఇదీ చదవండి: 'దేవుడి ఆజ్ఞతోనే మా బామ్మను చంపేశా'