ETV Bharat / bharat

'కొవిడ్ మరణాలను దాచిపెడుతున్న ప్రభుత్వం' - కరోనా మరణాలపై రాహుల్ గాంధీ

దేశంలో కరోనా మరణాలను కేంద్రం ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ టీకా విధానం గందరగోళంగా ఉందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు.

Rahul
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jun 2, 2021, 11:25 PM IST

దేశంలో కరోనా మరణాలను ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా టీకా పంపిణీ చేయాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు. ఈ మేరకు కరోనా మరణాలకు సంబంధించి ఓ మీడియాలో వచ్చిన సర్వే నివేదికను రాహుల్​ తన ట్వీట్​కు జోడించారు.

"కరోనాను ఎదుర్కోవడంలో టీకానే ప్రధానమైన రక్షణ కవచం. దేశప్రజలకు ఉచితంగా టీకా పంపిణీ చేయాలని నీ గొంతును వినిపించు. కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రాహుల్​ తన ట్వీట్​కు స్పీక్​అప్​ఫర్​యూనివర్సల్​వ్యాక్సినేషన్​ అనే హ్యాష్​ట్యాగ్​ను జత చేశారు. మరో ట్వీట్​లో దేశంలో వ్యాక్సిన్​ కొరత ఉందంటూ ఓ వీడియోను ఆయన షేర్ చేశారు.

ఇదీ చూడండి: ట్విట్టర్​లో ఆ 50 మందిని 'అన్​ఫాలో' చేసిన రాహుల్​

అంతకుముందు రాహుల్​ సోదరి, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా టీకాల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ టీకా విధానం గందరగోళంగా ఉందని ఎద్దేవా చేశారు.

"ప్రపంచంలోని అతి పెద్ద టీకా ఉత్పత్తిదారుల్లో మన దేశం కూడా ఒకటి. కానీ, ఇప్పటివరకు 3.4 శాతం మందికే టీకా అందింది. ఈ గందరగోళ టీకా పంపిణీ కార్యక్రమానికి బాధ్యులు ఎవరు? ఆగస్టు 15న దేశ ప్రజలందరికీ టీకా అందిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పుడు 2021 అర్ధభాగానికి వచ్చాం. ప్రస్తుతం రోజుకు 19 లక్షల మందికే టీకా ఇస్తున్నారు. ప్రధానమంత్రి చెప్పిన ఆ లక్ష్యం పూర్తవ్వాలంటే.. రోజుకు 70 నుంచి 80 లక్షల డోసులు అందజేయాలి."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

'మొదట టీకా పంపిణీ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి ఎప్పుడైతే మొదలైందో అప్పుడు చేతులెత్తేసింది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో అక్కడి ప్రభుత్వాలే టీకాలను సేకరించి.. రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేకపోతోంది?' అని ప్రియాంక ప్రశ్నించారు.

ఇదీ చూడండి: Central Vista: హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.