ETV Bharat / bharat

కాలేజ్​లో ర్యాగింగ్​ భూతం.. 'సార్​' అన్లేదని జూనియర్​ను చితకబాదిన సీనియర్లు.. భుజం విరగ్గొట్టి..

దిల్లీలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో సీనియర్లు రెచ్చిపోయారు. అదే కళాశాలలో చదువుతున్న ఓ జూనియర్ విద్యార్థి పట్ల అమానూషంగా ప్రవర్తించారు. తమను 'సార్' అని పిలవనందుకు విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో జూనియర్​ తీవ్రంగా గాయపడ్డాడు.

ragging
ragging
author img

By

Published : Dec 16, 2022, 3:34 PM IST

Updated : Dec 16, 2022, 3:53 PM IST

సీనియర్లన్న అహంకారంతో కొందరు విద్యార్థులు రెచ్చిపోతున్నారు. ర్యాగింగ్​ పేరుతో జూనియర్లతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పినట్టు వినకుంటే ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఈ తరహా ఘటనే దేశ రాజధాని దిల్లీలో జరిగింది. నోయిడాలోని జేఎస్‌ఎస్ కళాశాలలో జరిగిన ఈ ర్యాగింగ్ ఉదంతం వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమను 'సార్' అని పిలవనందుకు ఓ జూనియర్​ విద్యార్థిపై దాడి చేసి అతడి భుజంలోని ఎముకని విరగొట్టారు కొందరు సీనియర్​ విద్యార్థులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నోయిడాలోని జేఎస్‌ఎస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి డిసెంబర్ 7న రాత్రి తన హాస్టల్‌లో చదువుతున్నాడు. అతడి రూమ్‌మేట్‌కు కాల్​ చేసిన సీనియర్ విద్యార్థులు.. జూనియర్​ను తమ రూమ్​కు పంపమని చెప్పారు. ఈ క్రమంలోనే రూమ్​కు వెళ్లిన జూనియర్​ను వాళ్ల అసైన్‌మెంట్ పూర్తి చేయమని అడిగారు. అప్పటికే సీనియర్లు రూమ్​లో మద్యం తాగుతూ ఉన్నారని జూనియర్​ విద్యార్థి చెప్పాడు. అసైన్‌మెంట్‌ చేయడానికి జూనియర్ విద్యార్థి నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న సీనియర్‌ విద్యార్థులు మద్యం మత్తులో అతడితో అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి దిగారు. సార్​ అని పిలవాలని జూనియర్​ విద్యార్థిని బెదిరించారు.

కాలేజీ రిజిస్ట్రార్ తన తండ్రి స్నేహితుడంటూ మరో సీనియర్​ బెదిరించాడు. అనంతరం భయపడ్డ జూనియర్​ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. కాసేపటికి జరిగిన విషయంపై సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్‌ విద్యార్థులు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జూనియర్​ను మళ్లీ తమ రూమ్​కు రావాలని ఫోన్​ చేశారు. బాధితుడు రాను అని తెలిపాడు. కాసేపటికి సీనియర్​ విద్యార్థులే జూనియర్​ ఉండే రూమ్​కు వచ్చి లోపలి నుంచి తలుపుకు తాళం వేశారు. తమ గదికి పిలిస్తే ఎందుకు రాలేదని జూనియర్​ను సీనియర్లు ప్రశ్నించారు.

అనంతరం హాస్టల్‌లోని కారిడార్‌లో వార్డెన్‌, కళాశాల అధికారి ఎదుటే జూనియర్​ విద్యార్థిని సీనియర్‌ విద్యార్థులు మళ్లీ కొట్టారు. ఒకరు జూనియర్ విద్యార్థి చేతులు పట్టుకోగా, మరొకరు అతని మెడను నొక్కి పట్టుకున్నాడు. మరో సీనియర్​ విద్యార్థి బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లేంత వరకు కొడుతూ ఉన్నాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకుని సీనియర్ విద్యార్థులను వాళ్ల గదిలోకి పంపించాడు

ఈ ఘటన జరిగిన మరుసటి రోజు గాయపడిన విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాధితుడికి ఎక్స్-రే తీయగా పరీక్షలో భుజం ఎముక విరిగిందని తేలింది. విద్యార్థిపై దాడి కేవలం దాడి మాత్రమే కాదని ర్యాగింగ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్​ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్​లో కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థిపై దాడి, ర్యాగింగ్‌ ఘటనకు సంబంధించి జేఎస్‌ఎస్‌ కళాశాల మీడియా ఇన్‌చార్జి డాక్టర్‌ యోగేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన నలుగురు విద్యార్థులను కళాశాల నుంచి, హాస్టల్ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణకు కళాశాలలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ దురదృష్టకర ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపించి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
నిందితులైన విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు నోయిడా డీసీపీ హరీశ్ చందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని నేరం రుజువైతే నలుగురు విద్యార్థులపై దాడి నుంచి హత్యాయత్నం వరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Last Updated : Dec 16, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.