Rafale fighter jet India: రఫేల్ యుద్ధవిమానానికి సంబంధించి నేవీ వెర్షన్ గురువారం గోవా చేరింది. భారత నౌకాదళం నుంచి కాంట్రాక్టు పొందే ఉద్దేశంలో ఉన్న ఫ్రాన్స్ ఈ ఫైటర్‌ను పంపింది. తద్వారా దీని పోరాట సామర్థ్యాలను ప్రదర్శించాలనుకుంటోంది. స్వదేశీ విమానవాహక నౌక విక్రాంత్‌పై మోహరించేందుకు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని మన నేవీ ప్రణాళికలు రచిస్తోంది.
దీనిలో భాగంగా మొత్తం 57 జెట్ల కోసం ప్రతిపాదనలు ఆహ్వానించింది. రఫేల్‌తో పాటు ఎఫ్-18 (అమెరికా), మిగ్ 29కే (రష్యా), గ్రిపెన్(స్వీడన్) యుద్ధ విమానాలు బరిలో ఉన్నాయి. వచ్చే కొన్నినెలల్లో మిగతా జెట్లూ తమ సత్తా ప్రదర్శించేందుకు భారత్ చేరుకునే అవకాశం ఉంది.
2016లో వైమానిక దళం కోసం రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 33 యుద్ధవిమానాలను భారత్‌కు అందించింది ఫ్రాన్స్. త్వరలోనే మిగిలిన రఫేల్ జెట్లను భారత్‌కు అప్పగించనుంది.
ఇదీ చూడండి: సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపులు.. దౌత్యంతోనే సరైన ప్రయోజనం