ETV Bharat / bharat

విశ్వహిందూ పరిషత్​​ అధ్యక్షుడిగా రవీంద్ర నారాయణ్​ - విహెచ్​పీ న్యూస్​

విశ్వహిందూ పరిషత్​ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో పద్మ శ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్​ రవీంద్ర నారాయణ్​ సింగ్​ ఎన్నికయ్యారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తోన్న విష్ణు సదాశివ కోక్జీ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.

VHP president
విశ్వ హిందూ పరిషత్​
author img

By

Published : Jul 17, 2021, 7:12 PM IST

విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ)​ అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థోపెడిక్​ సర్జన్​, పద్మ శ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్​ సింగ్​ ఎన్నికయ్యారు. బిహార్​కు చెందిన సింగ్​.. వీహెచ్​పీ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గానూ 2010లో ఆయనను పద్మ శ్రీతో సత్కరించింది కేంద్రం.

ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న విష్ణు సదాశివ కోక్జీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు నారాయణ్​ సింగ్​. సదాశివ.. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

VHP president
విశ్వ హిందూ పరిషత్​ సమావేశం

"అధ్యక్షుడిగా పద్మ శ్రీ రవీంద్ర నారాయణ్​ సింగ్​ను ట్రస్ట్​ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోక్జీ జీ 82 ఏళ్లకు చేరుకున్నారు. వీహెచ్​పీ అధ్యక్షుడిగా తన సేవల నుంచి తప్పుకోవాలని కోరుకున్నారు. ఆయన కోరికతో పాటు మన రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాం. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపటం అనేది మనకు దక్కిన గౌరవం. "

- సురేంద్ర జైన్​, వీహెచ్​పీ జాయింట్​ జనరల్​ సెక్రటరీ.

అధ్యక్ష పదవితో పాటు ప్రధాన కార్యదర్శి​ కోసం ఎన్నికలు జరిగినట్లు జైన్​​ తెలిపారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికైనట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'ప్రజల విరాళాలతోనే అయోధ్య రామ మందిర నిర్మాణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.